BigTV English

SA vs IND Cape Town Test : మార్‌క్రమ్ అద్భుత సెంచరీ.. బుమ్రా సిక్సర్.. టార్గెట్ 79 రన్స్..

SA vs IND Cape Town Test : మార్‌క్రమ్ అద్భుత సెంచరీ.. బుమ్రా సిక్సర్.. టార్గెట్ 79 రన్స్..

SA vs IND Cape Town Test : సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ బౌలర్లకు స్వర్గధామంలా, బ్యాటర్లకు నరక యాతనగా మారింది. ఇలాంటి అత్యంత కఠినాతికఠినమైన పిచ్ మీద, ప్రపంచ నెంబర్ వన్ అనదగ్గ ఇరు జట్ల బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ సౌతాఫ్రికా ఓపెనర్ మార్ క్రమ్ అద్భుతంగా సెంచరీ చేశాడు. 2 సిక్సర్లు, 17 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేసి ఎట్టకేలకు సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.


176 పరుగలకు సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది. 78 పరుగుల లీడ్ దొరికింది. మొత్తానికి టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 79 పరుగులు సాధిస్తే విజయం సాధిస్తుంది. కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 153 పరుగుల వద్దే ఆరుగురు అవుట్ అయిపోవడం ఆందోళనగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా చాప చుట్టేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి టీమ్ ఇండియా బౌలర్లు శ్రమించారు. తమ వంతు కృషి చేశారు. 3 వికెట్ల నష్టానికి 62 పరుగులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను బుమ్రా ఆడుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే ఫోర్ కొట్టిన బెడింగ్ హమ్ (11) అదే ఊపులో ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ సహకారంతో బుమ్రా విజృంభించాడు. 6 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోకుండా చేశాడు.


ఓపెనర్ మార్ క్రమ్ మాత్రం కఠినమైన పిచ్ మీద అద్భుతంగా ఆడి సౌతాఫ్రికా జట్టుకి వెన్నుముకగా నిలిచాడు. తనని అవుట్ చేయడం భారత్ బౌలర్ల వల్ల కాలేదు. 71 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో ఒక సులువైన క్యాచ్ ని రాహుల్ వదిలేశాడు. ఒక ఎండ్ లో తను అలా ఉండిపోయాడు. తర్వాత వచ్చినవాళ్లంతా అవుట్ అవుతూ వెళ్లిపోయారు.

సౌతాఫ్రికా బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ తో పోల్చితే, రెండో ఇన్నింగ్స్ లో కొంచెం మెరుగ్గా ఆడి రెండంకెల స్కోర్ చేశారు. వెరైన్ (9), జాన్సన్ (11), కేశవ్ మహరాజ్ (3) వీరందరూ బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యారు. అయితే సిరాజ్, ప్రసిద్ధ్ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్ లో తేలిపోయారు. మార్ క్రమ్ ఇద్దరినీ ఒక ఆట ఆడుకున్నాడు. చివరికి ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో అయిన సిరాజ్, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో అయిన మార్ క్రమ్ ను అవుట్ చేసి ఇండియా గుండెల మీద బరువును దింపాడు.బూమ్రా 6, ముఖేష్ 2, ప్రసిద్ధ్ 1, సిరాజ్ 1 వికెట్ తీసుకున్నారు.

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×