Big Stories

Posani Krishna Murali: చిరంజీవిలో నిజాయితీ ఉందా..? పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani Krishna Murali Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరంజీవి సినిమాలను బిజినెస్ గా చూసినట్లే..రాజకీయాలను కూడా చూస్తారని ఆరోపించారు. చిరంజీవి రాజకీయాలకు పనికి రాడని విమర్శించారు.

- Advertisement -

ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 మంది అభ్యర్థులతో అసెంబ్లీలో చిరంజీవి అడుగుపెట్టారని అన్నారు. కానీ ఏ రోజూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే కాంగ్రెస్ లో కలిపి కేంద్ర మంత్రి అయ్యారని తెలిపారు. పదవి కాలం పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం  లేదన్నారు. చిరంజీవిని నమ్మి ఓటు వేసిన కాపు సోదరులను మోసం చేశారని పేర్కొన్నారు.

- Advertisement -

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని చిరంజీవి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. చిరంజీవిని మంచి నాయకుడిగా చూడాలనే ఉద్ధేశంతో తాను కూడా ప్రజారాజ్యం తరపున పోటీ చేశానని తెలిపారు. కానీ ఆయనకు రాజకీయాల పట్ల నిబద్ధత లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి జగన్ పాటు పడుతున్నారని కొనియాడారు.

Also Read: ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ఐదేళ్లుగా అభివృద్ది శూన్యం’.. ప్రధాని మోదీ

జగన్ పేదల కష్టాలు చూసి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. కానీ చంద్రబాబుకు అభివృద్ధి చేయడం ఇష్టం లేదని ఆరోపించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏం సంపద సృష్టించారని ప్రశ్నించారు. అర్బన్ ప్రజల కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు వస్తుందని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News