Big Stories

Mahindra XUV400 EV Facelift : స్పీడ్ పెంచిన మహీంద్రా.. 456 కిమీ రేంజ్‌తో త్వరలో కొత్త EV

Mahindra XUV400 EV Facelift : దేశంలోని ప్రముఖ SUV తయారీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఇటీవలే XUV 300, XUV 3XO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. కాంపాక్ట్ SUV విభాగంలో 3XO ను ప్రారంభించిన తర్వాత కంపెనీ ఇప్పుడు XUV 400 EV ఫేస్‌లిఫ్ట్ కోసం సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మహీంద్రా త్వరలో ప్రవేశపెట్టవచ్చు. దీన్ని వీలైనంత మీడియా త్వరగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని సంస్థ సన్నాహాలు చేస్తోంది. 3XO తర్వాత XUV 400 EV ఫేస్‌లిఫ్ట్‌పై ఏ సమాచారం వెల్లడైంది. ఈ కథనంలో చూద్దాం.

- Advertisement -

మహీంద్రా XUV 3XO లాంచ్ చేసిన తర్వాత XUV 400 EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. నివేదికల ప్రకారం దీని కోసం హోమోలోగేషన్ గురించిన సమాచారాన్ని కంపెనీ వెల్లడించింది. ఇందులో దాని మరిన్ని వేరియంట్‌ల పరిచయం గురించి కూడా సమాచారం అందిచారు.

- Advertisement -

Also Read : కొత్త రంగుల్లో యమహా FZS V4.. ఈ సారి లుక్ అదిరిపోయింది!

దీని ప్రకారం ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ ఇప్పటికే ఉన్న వేరియంట్‌ల మాదిరిగానే 34.5 kWh, 39.4 kWh కెపాసిటీ గల LGC సెల్ బ్యాటరీ ఎంపికలతో తీసుకురావచ్చు. అలానే మూడవ ఎంపికగా 39.4 kWh సామర్థ్యం గల ఫరాసిస్ సెల్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. దీనిలో అమర్చిన మోటార్ నుండి ఇది 150 PS పవర్ రిలీజ్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 456 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. అలానే దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

నివేదికల ప్రకారం కంపెనీ XUV 400 ఫేస్‌లిఫ్ట్‌కు అనేక ఫీచర్లను యాడ్ చేసింది. 3XOలో కంపెనీ అందించిన అనేక ఫీచర్లను 400 EV ఫేస్‌లిఫ్ట్‌లో చూడొచ్చు. ఇందులో కొత్త హెడ్‌లైట్, LED DRL, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక కనెక్ట్ చేయబడిన టెయిల్ లైట్లు, లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కనెక్ట్ చేయబడిన ఫీచర్లు మొదలైనవి ఉన్నాయి. దీనితో పాటు 3XO కొన్ని వేరియంట్లో చూసినట్లుగా సాఫ్ట్ టచ్ ఫీచర్ కూడా ఉంటుంది.

Also Read : రేపే లాంచ్ కానున్న కొత్త స్విఫ్ట్.. కొనేముందు ఇవి తెలుసుకోండి!

EC, EL ప్రో వేరియంట్‌లను కంపెనీ ప్రస్తుత వెర్షన్ XUV 400లో అందిస్తోంది. కానీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కంపెనీ దీనిని EC L, EC L(O), EC LL, EL LL (O), EL LH, EL LH (O), EL PH  EL PH (O) వేరియంట్‌లలో తీసుకురావచ్చు. కొత్త వేరియంట్ పొడవు 4200 mm,1821 mm వెడల్పు ఉంటుంది. దీని వీల్ బేస్ కూడా 2600 మి.మీ. స్కై రాక్‌తో దీని ఎత్తు 1634 మిమీ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News