Big Stories

Yamaha FZS V4 New Colour 2024 : కొత్త రంగుల్లో యమహా FZS V4.. ఈ సారి లుక్ అదిరిపోయింది!

Yamaha FZS V4 New Colour Launch In India 2024 : ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా భారత మార్కెట్‌లో అనేక గొప్ప బైక్‌లను అందిస్తోంది. కంపెనీ 150 సీసీ సెగ్మెంట్‌లో రెండు కొత్త కలర్స్‌లో పవర్‌ఫుల్ బైక్‌ను విడుదల చేసింది. 150 సీసీ ఎఫ్‌జెడ్‌లలో వెర్షన్ 4ని తీసుకొచ్చింది. ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, సైబర్ గ్రీన్ కలర్‌లో కంపెనీ ఈ బైక్‌ను విడుదల చేసింది. రెండు కొత్త కలర్స్ యువతకు బాగా నచ్చుతాయని కంపెనీ భావిస్తోంది. బైక్‌ను ఏ ధరకు తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ యమహా బైక్‌లను నేటి యువ రైడర్లు కేవలం ట్రావెలింగ్  కోసం మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ బైకులు ప్రపంచవ్యాప్తంగా రైడింగ్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. యువ రైడర్లు కొత్తకొత్త వేరియంట్‌లలో బైకులను కోరుకుంటున్నారు. కొత్త రంగులను ఇష్టపడుతున్నారు. కలర్ అనేది వారి వ్యక్తిత్వాన్ని సంబంధించించిన అంశంగా మారింది. కాబట్టి సంస్థ వారి అభిరుచులకు అనుగుణంగా ఈ మార్పులు చేసింది.

- Advertisement -

Also Read : కియా నుంచి బుజ్జి ఎలక్ట్రిక్ SUV.. మే 23న లాంచ్!

FZS-FI DLX పోర్ట్‌ఫోలియోలో అద్భుతమైన కలర్ ఆప్షన్‌లను ఈరోజు ప్రారంభించడం మా బ్రాండ్ ఆఫర్‌లను మా కస్టమర్‌లకు ఎల్లప్పుడూ అండగా ఉంచడానికి భారతీయ మార్కెట్‌‌లోని మా నిబద్ధతకు ఉదాహరణ. యువత ఊహలను ఆకర్షించడానికి, వినియోగదారుల ఆనందాన్ని పెంపొందించడానికి మా ఉత్పత్తులను నిరంతరం మెరుగుపరచడానికి, రిఫ్రెష్ చేయడానికి మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తాము.

యమహా ఎఫ్‌జెడ్ ఎస్ వెర్షన్-4 మొత్తం ఆరు రంగు ఎంపికలలో కంపెనీ అందిస్తోంది. ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, సైబర్ గ్రీన్ కాకుండా, వీటిలో మెజెస్టి రెడ్, రేసింగ్ బ్లూ, మాట్ బ్లాక్, మెటాలిక్ గ్రే ఉన్నాయి. FZ S వెర్షన్-4ని యమహా రెండు కొత్త రంగులతో లాంచ్ చేసింది. 1.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఈ రంగులతో బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

Also Read : రేపే లాంచ్ కానున్న కొత్త స్విఫ్ట్.. కొనేముందు ఇవి తెలుసుకోండి!

యమహా భారత మార్కెట్‌లో అనేక వాహనాలను అందిస్తోంది. వీటిలో 3220 cc విభాగంలో YZF-R3 MT-03 ఉన్నాయి. ఇది కాకుండా, YZF-R15 V4, YZF-R15S V3, MT-15 V2, FZS-Fi వెర్షన్ 4.0, FZS-Fi వెర్షన్ 3.0, FZ-Fi వెర్షన్ 3.0, FZ-X, AEROX వెర్షన్ S, AEROX, Fascino 125 హైబ్రిడ్, రే ZR 125 FI హైబ్రిడ్, రే ZR స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News