BigTV English

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం

Prabhas: కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు.


ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ప్రజలు వరద నీటిలో చిక్కుకుని విలవిలలాడు తున్నా రు. మరోవైపు ముఖ్యమంత్రులు దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు వరద సాయం.. మేము సైతమంటూ నటుడు చిరంజీవి.. చెరో


ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు మేము సైతం ముందుకొచ్చారు ప్రముఖులు. సినీ ప్రముఖలూ తమవంతు సాయం చేస్తున్నా రు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనవంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఏపీ- తెలంగాణకు సీఎం సహాయనిధికి రెండు కోట్లు విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు.

గతంలో వయనాడ్ వరద బాధితులకు కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు నటుడు ప్రభాస్. ప్రభాస్ తనవంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు. మరోసారి తాను గ్లోబల్ స్టార్ అని నిరూపించుకున్నాడు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. ఏపీ-తెలంగాణకు చెరో 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనంత సాయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Justice NV Ramana Donetes whopping Rs 20 lakhs for ap and telangana flood victims
Justice NV Ramana Donetes whopping Rs 20 lakhs for ap and telangana flood victims

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×