BigTV English

PM Modi Visit to Vizag: మోదీ జీ.. వీటిపై క్లారిటీ ఇస్తారా? పీఎం టూర్‌పై గంపెడాశలు

PM Modi Visit to Vizag: మోదీ జీ.. వీటిపై క్లారిటీ ఇస్తారా? పీఎం టూర్‌పై గంపెడాశలు

* ఇప్పటికైతే రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు
* విభజన హామీల సంగతేంటి?
* స్టీల్ ప్లాంట్‌పై క్లారిటీ ఉంటుందా?


– నేడు విశాఖకు ప్రధాని మోదీ
– భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
– 5వేల మంది పోలీసులు..
– 35 మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణ
– 1.5 కిలోమీటర్ల రోడ్ షో
– ప్రధానితోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
– బహిరంగ సభకు 3 లక్షల మంది
– రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు
– మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం
– మరి, విభజన హామీల సంగతేంటి?
– విశాఖ స్టీల్ ప్లాంట్‌పై క్లారిటీ ఇస్తారా?

స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన రాకపై గంపెడాశలు పెట్టుకున్నారు ప్రజలు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ కీలకంగా వ్యవహరిస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీలపై ఎన్నో అనుమానాలున్నాయి. మోదీ సర్కార్ ఆ హామీలు అమలు చేస్తుందా? లేదా? అనే ఎన్నో సందేహాలు రాష్ట్ర ప్రజలనే కాదు, రాజకీయ నేతల్ని కూడా కలకవరపరుస్తున్నాయి. ఇప్పటికే అమరావతిపై స్పష్టమైన హామీ ఇచ్చిన మోదీ, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, తదితర అంశాలపై క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు.


పీఎం టూర్ షెడ్యూల్

ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. దీనికోసం మ.3.55 గంటలకే చంద్రబాబు, పవన్ విశాఖ చేరుకోనున్నారు. సా.4.45 నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్‌షో ప్రారంభం అవుతుంది. సిరిపురం దత్ ఐ ల్యాండ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు 1.5 కిలోమీటర్ల పాటు ఈ రోడ్‌షో జరుగుతుంది. సా.5.30 గంటల నుంచి బహిరంగసభ ప్రారంభం అవుతుంది. ఈ సభా వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఉత్తరాంధ్రకు మహర్దశ

మోదీ విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రూ.2 లక్షలకు పైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పూడిమడక దగ్గర రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మిస్తున్నారు. అలాగే, నక్కపల్లిలో రూ.1,877 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్ కడుతున్నారు. ఇటు, తిరుపతి జిల్లా కృష్ణపట్నం దగ్గర రూ.2,139 కోట్లతో చేపట్టే ఇండస్ట్రియల్ సిటీ సహా పది జాతీయ రహదారులు, 7 రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మోదీ టూర్‌తో ఉత్తరాంధ్రకు మహర్దశ రాబోతోందని కూటమి నేతలు చెబుతున్నారు.

విభజన హామీలపై క్లారిటీ ఉంటుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో ఏపీకి అనేక హామీలను ఇచ్చారు. పదేళ్లయినా ఇంకా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. దశాబద్దకాలం కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. ప్రత్యేక హోదా, నూతన రాధానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం, కొత్త పరిశ్రమలు, కడప స్టీల్, కొత్త పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో, పోలవరానికి జాతీయ హోదా, ఇలా పదేళ్ల క్రితం ఇచ్చిన హామీల్లో ఎక్కువశాతం పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మోదీ టూర్ నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందిస్తారా?

ప్రధాని విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి జోరందుకుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేయాలని, ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా వనరులు కకేటాయించాలని నిరసనకారుల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోదీ ఈ అంశంపై మాట్లాడతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదని ఇప్పటికే కూటమి నేతలు క్లారిటీ ఇచ్చారు. కానీ, మోదీ నోటి నుంచి స్పష్టమైన హామీ రావాలనేది నిరసనకారుల డిమాండ్.

భారీ బందోబస్తు.. నేతల పరిశీలన

మోదీ బహిరంగ సభకు 3 లక్షల మంది దాకా తరలివస్తారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోనే 5వేల మంది పోలీసులు ఉంటారు. 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో రోడ్ షో జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూటమి నేతలు పరిశీలిస్తున్నారు. మంగళవారం ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రధాని టూర్‌తో 3 లక్షల ఉద్యోగాల వరకు వస్తాయనేది తమ నమ్మకంగా చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రోడ్ షోలో లక్ష మంది పాల్గొంటారని, సభలో 3 లక్షల మంది ప్రజలు పాల్గొనడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రగతికి సోపానమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విశాఖ వస్తున్నారని, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని వివరించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×