స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించే ముఖ్యమైన యాప్స్ లో వాట్సాప్ ఒకటి. చాలా మంది తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంతో పాటు ఆఫీస్ పనులను వాట్సాప్ ద్వారా చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది. అంతేకాదు, బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోతుంది. మోబైల్ డేటా, ఛార్జింగ్ అయిపోవడం వల్ల యూజర్లు చిరాకుగా ఫీలవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, మీ స్మార్ట్ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలంటున్నారు టెక్ నిపుణులు. ఈ సెట్టింగ్స్ తో బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవడంతో పాటు డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు.
డేటా ఎందుకుకు ఈజీగా అయిపోతుందంటే?
వాట్సాప్ ఉపయోగించడం వల్ల డేటా ఈజీగా అయిపోవడానికి చాలా కారణాలున్నాయి. వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ చేయడంతో పాటు ఫోటోలు, డాక్యుమెంట్స్ ఎక్కువగా పంపుకోవడం వల్ల డేటా అయిపోతుంది. ప్రస్తుతం వాట్సాప్ లో HD ఫైల్ షేరింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్ కారణంగా డేటా త్వరగా అయిపోతుంది. డేటా వినియోగం తగ్గాలంటే చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఇవే..
1.కాల్స్ సెట్టింగ్స్ మార్చుకోండి
వాయిస్, వీడియో కాల్స్ సమయంలో డేటా వినియోగాన్ని తగ్గించుకునేందుకు కొన్ని సెట్టింగ్స్ చేసుకోండి.
⦿ ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. పైన రైట్ సైడ్ లో ఉన్న మూడు చుక్కల మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోండి.
⦿ స్టోరేజ్ అండ్ డేటాను సెలెక్ట్ చేసుకోండి.
⦿ నెట్‌వర్క్ యూసేజ్ తోకి వెళ్లి కాల్స్ కోసం తక్కువ డేటాను ఉపయోగించండి అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మంచి ఆడియో క్వాలిటీని కొనసాగిస్తూనే కాల్స్ కు తక్కువ డేటా ఉపయోగించుకునేలా చూసుకోవచ్చు.
2.మీడియా క్వాలిటీ సెట్టింగ్స్
మీరు పంపే ఫోటోలు, వీడియోల క్వాలిటీ మార్చడం ద్వారా డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ స్టోరేజ్ అండ్ డేటా సెక్షన్ లోకి వెళ్లి మీడియా అప్ లోట్ క్వాలిటీ మీద ట్యాప్ చేయాలి.
⦿ HDకి బదులుగా స్టాండర్డ్ క్వాలిటీని ఎంచుకోవాలి.
ఈ సెట్టింగ్ ద్వారా వీడియోలు, ఫోటోలు పంపే సమయంలో తక్కువ డేటా వినియోగం అవుతుంది.
ఈ సెట్టింగ్స్ తో లాభం ఏంటి?
కమ్యూనికేషన్ కోసం అవసరమైన బ్యాండ్ విడ్త్ ను తగ్గించడానికి కాల్స్ కోసం డేటా సేవ్ చేసేలా ఉపయోగపడుతాయి. ఫోటోలు, వీడియోలకు స్టాండర్డ్ క్వాలిటీకి సెట్ చేయడం ద్వారా ఫైల్స్ ట్రాన్స్ ఫర్ సమయంలో డేటా వినియోగం తగ్గుతుంది. మొత్తంగా డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
బ్యాటరీ బ్యాకప్ పెంచుకోవడం ఎలా?
వాట్సాప్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు డిస్ ప్లే బ్రైట్ నెస్ తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు బ్యాకప్ లో రన్ అయ్యే ఫైల్స్ ను క్లియర్ చేయాలి. ఈ రెండు పద్దతులు పాటించడం వల్ల ఛార్జింగ్ వేస్ట్ కాకుండా ఉంటుంది.
Read Also: మీ పాత ఫోన్ కొత్త దానిలా పనిచేయాలంటే.. సింఫుల్ గా టిప్స్ పాటించండి!