BigTV English

PSLV Countdown: PSLV-C58 ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న వాహననౌక

PSLV-C58 Count down

PSLV Countdown: PSLV-C58 ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న వాహననౌక
PSLV-C58 Count down

PSLV Countdown: పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి58, ఎక్స్‌పోశాట్‌ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.


కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపడుతోంది. PSLV వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం ఎక్స్‌పోశాట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. శ్రీహరికోటలో ఇవాళ ఉదయం 8.10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఎక్స్‌పోశాట్‌ ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోభివృద్ధికి బాటలు వేయనుంది. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ ఉద్దేశం. ఈ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు. PSLV చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది.


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×