E-Paper
Advertisement

యాక్సిడెంట్ కాదు.. హత్యాయత్నం! రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన ప్రకటన

యాక్సిడెంట్ కాదు.. హత్యాయత్నం! రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన ప్రకటన
Advertisement

Rajahmundry medico Priyanka case update: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఘటనలో మెడికో విద్యార్థిని  ప్రియాంకను కారుతో ఢీకొట్టిన  ఘటనకు సంబంధించి పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసు దర్యాప్తు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటన కేవలం యాక్సిడెంట్ కాదని, నిందితుల అత్యంత క్రూరమైన చర్య అని  ఆయన స్పష్టం చేశారు.

ఈనెల 3వ తేదీ రాత్రి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.అదే సమయంలో మాల్ వద్దకు వచ్చిన నిందితులు మద్యం మత్తులో ఉన్నారు. మాల్ లోపలికి వెళ్లేందుకు వారు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిందితులు సెక్యూరిటీపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించడంతో నిందితులు మరింత భయపడి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపారు.

Advertisement

పారిపోయే క్రమంలో.. రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను ఆ నిందితులు కారుతో ఏకంగా మూడు సార్లు బలంగా ఢీకొట్టారు. ఈ దారుణ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు ఆపకుండా హిట్ అండ్ రన్ కేసులా పారి పోయారు. అదే రోజు రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆ రోజు రాత్రే వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్‌మెంట్‌ను సేకరించి కేసు నమోదు చేశారు.

ఘటన జరిగిన తీరును.. పరిశీలించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. స్కూటీని కావాలనే మూడు సార్లు ఢీకొట్టి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టినట్లు సీసీటీవీలో స్పష్టంగా తేలింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, కేసు తీవ్రతను బట్టి సెక్షన్లలో మార్పులు చేశారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్లు పక్కా ఆధారాలు సేకరించామని వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం నిందితులపై కల్పబుల్ హోమిసైడ్ అటెంప్ట్ (సెక్షన్ 110) కింద కేసు నమోదు చేశామని, పరిస్థితులకు తగినట్లుగా మరింత కఠిన సెక్షన్లు జత చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను మరింత విచారించేందుకు సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, నిస్పక్షపాతంగా విచారణ జరుగుతోందని చెప్పారు. నగరంలో రాష్ డ్రైవింగ్‌కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నివారణా చర్యలు చేపడతామని ఎస్పీ హెచ్చరించారు.

Tags

Related News

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×