E-Paper
Advertisement

లాల్ దర్వాజా బోనాల వైభవం.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రులు

లాల్ దర్వాజా బోనాల వైభవం.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రులు
Advertisement

Lal Darwaza Bonalu 2026 updates : భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల సంబరాలు అత్యంత కన్నల పండగగా కొనసాగుతున్నాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రముఖులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ‘బంగారు బోనం’ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రజలందరిపై సింహవాహిని అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు. అంతే కాకుండ ఈ ఏడాది బోనాల పండగ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ. 20 కోట్లు కేటాయించిందని, ఆషాఢ మాసం బోనాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఎల్ నీనో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని, రైతన్నలను కాపాడాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో.. అన్ని రకాల ఏర్పాట్లను చేసి బోనాల పండగను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో..  సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో జాతర ప్రశాంతంగా, ఆనందకర వాతావరణంలో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అమ్మవారి నామస్మరణతో పాతబస్తీ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×