E-Paper
Advertisement

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?
Advertisement

Bigg Boss Varshini Venkat:బుల్లితెర ఇండస్ట్రీలో యువ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి వెంకట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రముఖ టెలివిజన్ రియాల్టీ షోలలో పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె తమిళ్ బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది. అలాంటి ఈమెపై ఇప్పుడు కేసు నమోదు కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ కేసు ఎవరు పెట్టారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

యువ నటి వర్షిణి వెంకట్ పై కేస్ ఫైల్..

ఒక యువకుడిని షార్ట్ ఫిలిం నిర్మాణం పేరుతో మోసం చేసి రూ.5లక్షలు వసూలు చేయడమే కాకుండా డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా బెదిరించి , నగదు, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుంది అనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సినీ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించింది.

Advertisement

ALSO READ:గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటి వర్షిణి వెంకట్ కు చెన్నైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న ఆమె.. త్వరలో ఒక ప్రతిష్టాత్మక షార్ట్ ఫిలింను నిర్మించబోతున్నామని ఆ వ్యక్తికి చెప్పిందట. ఆ చిత్రంలో పెట్టుబడి పెడితే మంచు లాభాలు వస్తాయని, నిర్మాణ భాగస్వామ్యం కల్పిస్తానని అతడిని నమ్మబలికింది. ఆమె చెప్పిన మాటలను నమ్మిన బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.5లక్షల నగదును ఆమెకు అందించారు. కాలం గడుస్తున్నా షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభం కాకపోవడం, చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతో మోసపోయాను అని గ్రహించిన బాధితుడు తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని వర్షిణి వెంకట్ ను నిలదీశాడట.

రూ. 27 లక్షల ఇవ్వాలని డిమాండ్.. నగదు తోపాటు మొబైల్ ఫోన్ లాక్కున్న వర్షిణి..

Advertisement

అయితే ఆమె పై పదేపదే బాధితుడు ఒత్తిడి తీసుకురావడంతో కోపంతో గిండి ప్రాంతంలో తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడిందని , పైగా రూ.27 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ,ఇవ్వకపోతే అబద్ధపు కేసు పెడతానని బాధితుడిపై దాడికి దిగడమే కాకుండా రూ.50, 000 నగదును, అతని దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లో బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరార్ అయిందట. ఈ ఘటనపై బాధితుడు వెంటనే గిండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బలవంతపు వసూళ్లు , మోసం, బెదిరింపుల కింద వర్షిని వెంకట్ తో పాటు ఆమె అనుచరులు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. వర్షిణి వెంకట్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా అనుచరులు పారిపోవడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Related News

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Big Stories

Advertisement
×