E-Paper
Advertisement

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు
Advertisement

Daayra OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో ప్రఖ్యాత దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘Daayra’ ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. 2026 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నవంబర్ 13 నుండి ప్రముఖ ఓటీటీలో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఒక మాస్టర్ పీస్ లా నిలుస్తుంది. ఈ కథ హైదరాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనతో పోలికలు ఉన్నప్పటికీ, దర్శకురాలు మేఘనా గుల్జార్ ఇది ఒక్క కేసు ఆధారంగా రూపొందించలేదని స్పష్టం చేశారు. అలాగే  ఈ వీకెండ్ లో ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని ఒక పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. మరి ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

దిల్లీ సమీపంలోని ఓ హైవేపై రాగిణి పూజారి (ప్రగతి మిశ్రా) అనే యువతి కనిపించకుండా పోతుంది. ఆమె తల్లి పార్వతి (క్షితీ జోగ్), సోదరుడు కబీర్ (భవేష్ బబ్బానీ) పోలీసులను ఆశ్రయించినా మొదట్లో సరైన స్పందన లభించదు. మరుసటి రోజు ఓ నిర్మానుష్య ప్రాంతంలో రాగిణి కాలిపోయిన మృతదేహం లభిస్తుంది. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

ఇక ఈ కేసును ఛేదించే బాధ్యత డీసీపీ రామన్ కుమార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)కు అప్పగిస్తారు. తన బృందంతో కలిసి దర్యాప్తు చేపట్టిన రామన్, కొద్ది రోజుల్లోనే నలుగురు నిందితులను పట్టుకుంటాడు. అయితే వారిని కోర్టులో హాజరుపరిచేలోపే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నలుగురూ చనిపోతారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పాటు పోలీసులపై కాల్పులు జరిపారని, అందుకే ఎదురుకాల్పుల్లో వారు మరణించారని రామన్ బృందం చెబుతుంది. ఇలాంటి దారుణమైన నేరానికి పాల్పడినవారికి వెంటనే శిక్ష పడిందని ప్రజలు రామన్‌ను హీరోలా కీర్తిస్తారు. కానీ, ఇది నిజమైన ఎన్‌కౌంటరా? లేక పోలీసులే పథకం ప్రకారం నిందితులను చంపేశారా? అనే ప్రశ్నలు కూడా మొదలవుతాయి.

ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టేందుకు ఇంటర్నల్ విజిలెన్స్ విభాగానికి చెందిన డీసీపీ అజూని కోహ్లి (కరీనా కపూర్ ఖాన్) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగుతుంది. చట్టాన్ని, న్యాయపద్ధతులను గౌరవించే అజూని ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో రామన్ చెప్పిన విషయాల్లో అనేక అనుమానాలు, పొంతనలేని అంశాలు బయటపడతాయి. అసలు రాగిణి కేసులో ఏం జరిగింది? నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ నిజంగానే తప్పించుకునే ప్రయత్నంలో జరిగిందా? రామన్ చెప్పే కథకు, అజూని దర్యాప్తులో బయటపడే నిజాలకు మధ్య ఉన్న తేడా ఏంటి? చివరికి అజూని ఇచ్చిన నివేదిక ఎలాంటి సంచలనం సృష్టించింది? అనేదే మిగతా కథ.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Advertisement

పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సంచలన క్రైమ్ థ్రిల్లర్ ‘దాయిరా’ (Daayra) ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది హిందీ, మలయాళం భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్ కుమార్‌గా, కరీనా కపూర్ ఖాన్ డీసీపీ అజూని కోహ్లిగా నటించారు. ప్రగతి మిశ్రా రాగిణి పాత్రలో కనిపించగా, క్షితీ జోగ్, జితేంద్ర జోషి, కన్వల్‌జీత్ సింగ్, తృప్తి ఖమ్కర్, సందీప్ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Read Also: ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి

Tags

Related News

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు… ప్రతి క్షణం ఉత్కంఠ.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెరవెనుక గ్లామర్ తారల చీకటి దందాలు… ఓ హీరోయిన్ సూసైడ్ వెనుక ఇంత పెద్ద మాఫియా కథా?

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

రణబాలిగా ఓటీటీలో విజయ్ దేవరకొండ ఊచకోత షురూ… ఈ రేంజ్ వైలెన్స్ ఎప్పుడైనా చూశారా?

ఓటీటీలోకి ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ కల్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Friday OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 18 స్ట్రీమింగ్..!

ప్రేయసిని చంపేసిన గ్యాంగ్ పై ప్రతీకారం… 12 ఏళ్లు వెనక్కి వెళ్లే యువకుడు… యానిమే లవర్స్ కు ఐ ఫీస్ట్

Big Stories

Advertisement
×