E-Paper
Advertisement

రెడ్ ఫ్లాష్‌లైట్ ఎందుకంత స్పెషల్? పోలీసుల నుంచి ఆస్ట్రానమర్ల వరకు అందరూ దీన్నే వాడతారెందుకు?

రెడ్ ఫ్లాష్‌లైట్ ఎందుకంత స్పెషల్? పోలీసుల నుంచి ఆస్ట్రానమర్ల వరకు అందరూ దీన్నే వాడతారెందుకు?
Advertisement

Red Flashlight Uses: చీకటి పడగానే మనం సాధారణంగా వైట్ లైట్ ఫ్లాష్‌లైట్‌లను వాడుతుంటాం. కానీ, మార్కెట్లో విభిన్న రకాల లైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ‘రెడ్ లైట్ ఫ్లాష్‌లైట్’ చాలా ప్రత్యేకమైనది. దీనిని ముఖ్యంగా చీకట్లో మన కంటి చూపు దెబ్బతినకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. సైన్స్ ప్రకారం.. ఎరుపు రంగు కాంతికి తరంగదైర్ఘ్యం (wavelength) చాలా ఎక్కువ. ఇది కళ్లపై పెద్దగా ప్రభావం చూపదు. వైట్ లైట్‌తో పోలిస్తే.. దీని వల్ల కళ్లు జిగేల్మనడం లేదా అలసిపోవడం వంటివి జరగవు.

నక్షత్రాలను చూసేవారికి బెస్ట్ ఫ్రెండ్:

మనం చీకట్లో ఉన్నప్పుడు కంటిలోని రొడోప్సిన్ అనే ప్రోటీన్ వల్ల వస్తువులను చూడగలుగుతాము. తెల్లటి కాంతి పడగానే ఈ ప్రోటీన్ తాత్కాలికంగా పని చేయకపోవడం వల్ల కాసేపు కళ్లు కనిపించవు. కానీ, ఎరుపు రంగు కాంతి వల్ల ఈ సమస్య రాదు. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు (ఆస్ట్రానమర్స్) రాత్రిపూట స్టార్ చార్ట్‌లు చదవడానికి, టెలిస్కోప్‌లను సెట్ చేయడానికి ఈ రెడ్ లైట్‌నే వాడతారు. మీరు కూడా ఎప్పుడైనా నక్షత్రాలను చూడటానికి వెళ్తే, ఈ లైట్‌ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

Advertisement

Also Read: నో ఇంటర్నెట్.. నో సిగ్నల్.. అయినా Google Maps సూపర్‌గా పనిచేస్తుందిలా!

పోలీసులు ఎందుకు ఉపయోగిస్తారంటే?

రాత్రి వేళల్లో డ్యూటీ చేసే పోలీసులకు కూడా ఈ రెడ్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చీకట్లో ఎవరిదైనా ఐడీ కార్డ్ లేదా పేపర్లు చెక్ చేయాల్సి వచ్చినప్పుడు దీనిని వాడుతుంటారు. దీనివల్ల వారి కంటి చూపు దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే, దూరంగా ఉన్నవారికి సిగ్నల్స్ ఇవ్వడానికి కూడా ఇది పనికొస్తుంది. మిలిటరీలో కూడా రహస్య ఆపరేషన్ల కోసం, శత్రువుల కంట పడకుండా ఉండటానికి ఈ లైట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు.

జంతువులను గమనించడానికి:

Advertisement

కేవలం మనుషులకే కాదు.. వేటగాళ్లకు, అడవి జంతువులను పరిశోధించే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన గ్యాడ్జెట్. చాలా రకాల జంతువులకు ఎరుపు రంగు సరిగ్గా కనిపించదు. అందువల్ల, రాత్రిపూట అడవిలో ఈ లైట్ వేసినా జంతువులు భయపడి పారిపోవు. అవి చేసే పనులకు ఎలాంటి అంతరాయం కలగదు. అందుకే వన్యప్రాణుల ఫొటోగ్రఫీ చేసేవారికి ఇది చాలా అవసరం.

Also Read: ల్యాండ్‌స్కేప్ కెమెరాతో శాంసంగ్ కొత్త టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Related News

ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

Big Stories

Advertisement
×