BigTV English

YS Viveka Case Updates: వివేకా కేసులో అసలేం జరుగుతుంది..? రంగన్న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం..

YS Viveka Case Updates: వివేకా కేసులో అసలేం జరుగుతుంది..? రంగన్న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం..

YS Viveka Case Updates: వైఎస్ వివేకానంద హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం జరపనున్నారు. కడపలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వివేకానంద ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీపోస్టుమార్టం కోసంనలుగురు వైద్యులతో కూడిన బృందం పులివెందులకు చేరుకుంది. సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరగనుంది.


ఇదిలా ఉంటే.. వివేకాహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై ఆమె భార్య ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వివేకాహత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు చనిపోతున్నారు. వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు. దీంతో రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశామని కడప ఎస్పీ తెలిపారు. రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.

అంతేకాదు.. వివేకాహత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు చనిపోతున్నారు. వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు. దీంతో రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశామని కడప ఎస్పీ తెలిపారు. రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. అంతేకాదు.. సాక్షులు మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయని ఎస్పీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్‌మెన్ రంగన్న ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. వీరంత ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు.


టీడీపీ నేత బీటెక్ రవి కూడా రంగయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ అనుకూల మీడియా ప్రవర్తన చూస్తుంటే తమ అనుమానాలు బలపడుతున్నాయని అన్నారాయన. రంగన్న మృతి విషయంలో నిందను ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. హత్య జరిగిన టైంలో ఆయన వివేకా ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పని చేసేవారు. హత్య జరిగిన రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు. వివేకానందరెడ్డి చనిపోయినరోజు అక్కడ తాను నలుగురు చూశానని రంగన్న సీబీఐకీ వాంగ్మూలం ఇచ్చారు. రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసు దర్యాప్తు కొంతమేర ముందుకు కదిలింది. రంగన్న వాగ్మూలం ఇవ్వడంతో నిందితుల నుంచి ఆయనకు ప్రమాదం ఉంటుందనే అనుమానంతో1+1 భద్రత కూడా కల్పించింది ప్రభుత్వం.

Also Read: వివేకా కేసులో కొత్త ట్విస్ట్.. సాక్షుల మృతిపై విచారణ, టెన్షన్ నిందితులు

అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్నపుడు రంగన్న మృతి చెందారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు రంగన్నను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా  రీ పోస్టుమార్టం జరపనున్నారు.. దీంతో నిజాలు బయటకొస్తాయా? లేదా అని ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×