Nani Court Movie..నాచురల్ స్టార్ నాని(Nani ) ఒకవైపు ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ సినిమాలలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూనే.. అందరిని మెప్పించేలా సరికొత్త కథాంశంతో చిత్రాలను నిర్మిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ జగదీష్(Ram Jagadeesh) అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. నాని నిర్మిస్తున్న చిత్రం ‘కోర్ట్: స్టేట్ Vs ఏ నోబడీ ‘.. భారీ అంచనాల మధ్య ప్రియదర్శి (Priyadarshi ) ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తూ.. తెరకెక్కుతున్న చిత్రమిది. మార్చి 14వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నాని చేసిన కామెంట్లు ఇప్పుడు ట్రోలర్స్ కి తావు ఇచ్చిందని చెప్పాలి.
16 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు బ్రతిమలాడలేదు..
కోర్ట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నాని మాట్లాడుతూ.. “నా 16 సంవత్సరాల కెరియర్ లో ఎప్పుడూ నేనిలా ఒక స్టేజి ఎక్కి దయచేసి సినిమా చూడండని అడిగి ఉండను. దయచేసి 14వ తారీఖున థియేటర్ కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని, మాకు ఏదో సక్సెస్ కావాలని, మేమేదో చాలా సంపాదించాలని చెప్పట్లేదు. నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఒక సినిమాని మిస్ అవ్వకూడదని మీ అందరిని బ్రతిమలాడుతున్నాను. మీ ఇంట్లో ఉన్న అందర్నీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని థియేటర్ కి తీసుకెళ్లి కచ్చితంగా ఈ సినిమా చూడండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూశామన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది” అంటూ నాని తెలిపారు. అయితే ఈ విషయంపై ట్రోలర్స్ నాని పై మండిపడుతున్నారు.
also read:Nani Court Movie: అడ్డంగా ఇలా దొరికిపోయావేంటి నాని..!
C/o కంచరపాలెం సినిమా విషయంలో కూడా ఇదే మాట..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పుడు తన పదహారేళ్ల కెరియర్ లో ఎప్పుడూ ఇలా స్టేజ్ ఎక్కి సినిమా చూడండి అని బ్రతిమలాడలేదు అని నాని చెప్పడంతో నాని పాత వీడియోలను కొంతమంది ట్రోలర్స్ బయటకు తీస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు నాని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2018 లో విడుదలైన కేరాఫ్ కంచరపాలెం సినిమా రివ్యూ ఇస్తూ నాని ఇదే తెలియజేశారు. అందులో నాని మాట్లాడుతూ..” నెక్స్ట్ నా సినిమా విడుదల కాబోతోంది. నా సినిమా చూడకపోయినా పర్లేదు, దయచేసి ఈ కేరాఫ్ కంచరపాలెం సినిమా చూడండి. తెలుగు నేటివిటీకి ఉట్టిపడేలా ఈ సినిమా ఉంది. కచ్చితంగా దయచేసి ఈ సినిమా చూడండి” అంటూ రిక్వెస్ట్ చేసిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి..
ఇక కంచరపాలెం సినిమా సమయంలో కూడా నా సినిమా చూడకపోయినా పర్లేదు అని చెప్పిన నాని.. ఇప్పుడు కోర్టు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా అదే చెబుతున్నాడు. మార్చి 14వ తేదీన థియేటర్లకు వెళ్లి కోర్టు సినిమా చూడండి. నేను చెప్పిన మాటలకు, ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవకపోతే మరో రెండు నెలల్లో వచ్చే నా హిట్ 3 సినిమా చూడకండి అంటూ నాని స్టేజ్ పైనే చెప్పేశారు. ఇక దీంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తూ నానిని ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఇదే మాట చెబుతావు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా నాని ఇదే చెబుతున్నాడు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడానికి ఇదో కొత్తరకం స్ట్రాటజీ అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.