CM Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలను ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరించారు. తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు.
గతంలో మాదిరిగానే ఇప్పుడు ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ క్రమంలో ఈవోను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎవరో చేశారని మీరు అలానే చేస్తారా? మీ కంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించారు. టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోలేదని సూటిగా ప్రశ్నించారు.
కొత్త ప్రదేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా చేయాలో ముందే అధికారులకు చెప్పలేదా? బాధ్యత తీసుకున్నవారు సక్రమంగా చేస్తున్నారో లేదో మానటరింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పని చెయ్యడం నేర్చుకోవాలన్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాని ప్రకారం పని చెయ్యాలన్నారు.
తిరుపతిలోని తొక్కిసలాట ఘటన స్థలానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.
తొక్కిసలాటకు గల కారణాలను వివరిస్తున్న మంత్రులు, అధికారులు#ChandrababuNaidu #Andrapradesh pic.twitter.com/EdJtWWI9H6
— TDP Trends (@Trends4TDP) January 9, 2025