Rowdy Sheeter Hull Chal: విశాఖ కేజీహెచ్‌లో రౌడీ షీటర్ హల్ చేశాడు. చిన్న పిల్లల వార్డులో రెచ్చిపోయాడు. పిల్లల వార్డులో ఆక్సీజన్ పైపులను కట్ చేసే ప్రయత్నం చేశాడు రౌడీ షీటర్ రాజు. తనని ఉద్యోగంలో నుంచి తీసేశారనే కోపంతోనే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను సెక్యూరిటీ గార్డెన్ గమనించి.. రౌడీ షీటర్ రాజును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతన్ని కత్తితో బెదిరించాడు. రౌడీ షీటర్ రాజుకి మరో ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రాజుని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై సూపరిండింటెంట్ శివానంద్ స్పందించారు. ఈ ఘటనకు పాల్పిడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో.. మరొక సారి నిఘా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఏకంగా చిన్న పిల్లల వార్డు దగ్గర ఆక్సీజన్ పైపు కట్ చేసే ప్రయత్నం చేశాడు రౌడీ షీటర్ రాజు. అయితే చాలా కాలం నుంచి కూడా విశాఖ కేజీహెచ్ హాస్పటల్‌లో దొంగతనాలు జరగడం, మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు జరగడం ఇటీవల హల్ చేశాయి. ఈ తరుణంలో మరొకసారి ఏకంగా చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ఆక్సీజన్‌కు సంబంధించి పైపులను కట్ చేసే ప్రయత్నం చేశాడు.
అయితే రాజు అనే వ్యక్తి కేజీహెచ్‌లో కాంట్రాక్టర్ ఉద్యోగం చేస్తాడు. డ్యూటీకి వచ్చేటప్పుడు తరుచూ మధ్యం సేవించి వస్తుండడంతో.. హాస్పిటల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో హాస్పటిల్ వద్ద హల్ చల్ చేశాడు. దీంతో కేజీహెచ్ ఆస్పత్రి యాజమాన్యం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: మంత్రి రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఆగ్రహం.. ఆపై ట్రోలింగ్, ఎందుకు?
ఇదిలా ఉంటే.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలోని ఓ ప్రెవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. చైతన్య స్కూల్లో lKG చదువుతున్న చిన్నారి వైష్ణవి చెప్పిన మాట వినడం లేదనీ వీపుపై వాతలు పడేలా కొట్డాడు ఉపాధ్యాయుడు. చిన్నారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ పంపాలని వైద్యులు సూచించారు. చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.