TDP Cadre Angry: సమయం, సందర్భం వచ్చినప్పుడు కొందరు నేతలు చెప్పేమాట. పార్టీ కార్యకర్తలే తమకు సుప్రీం అప్పుడప్పుడు చెబుతారు. ఇప్పుడు అదే కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఎలాంటి నాయకుడైనా తలవంచాల్సిందే. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విషయంలో ఏం జరగబోతోంది? ఇదే ప్రశ్న టీడీపీ అభిమానులను వెంటాడుతోంది.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళం పట్టణానికి వచ్చారు సింగర్ మంగ్లీ. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీ తరహాలో మంత్రి రామ్మోహన్ నాయుడు పక్కనే నిలబడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై మండిపడుతోంది టీడీపీ కేడర్.
ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు దర్శనం చేసుకున్నారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. వైసీపీ సింగర్ మంగ్లీని దగ్గరుండి దర్శనం చేయించడంపై రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని దర్శనానికి ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున పాటలు పాడమంటే పాడలేదని, అలాంటి వ్యక్తికి దగ్గరుండి ఏ విధంగా దర్శనం చేయిస్తారని రుసరుసలాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు పలకనన్న మంగ్లీ.. వీఐపీ ఏ విధంగా అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం తాము 40 ఏళ్లు కష్టపడ్డామని గుర్తు చేస్తున్నారు. మరి కార్యకర్తల ట్రోలింగ్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ: ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీ, మా టార్గెట్ అదే
వైసీపీ హయాంలో టీటీడీ ఛానెల్‌కు మంగ్లీ సలహాదారుగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరపున ఆమె పాడిన పాటలు ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో టీడీపీకి పాటలు పాడాలని రిక్వెస్ట్ చేశారట కొందరు నేతలు. ఎట్టి పరిస్థితుల్లో పాడేది లేదని తెగేసి చెప్పారంట సింగర్.
ఈ వ్యవహారాన్ని నేతలు మరిచిపోయినా, కార్యకర్తలు మరిచిపోలేదు. ఇది ముమ్మాటికీ పార్టీ కార్యకర్తలను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. కార్యకర్తలకు క్షమాపణలు చెప్పి ఈ విషయానికి ఇంతటితో ముగింపు ఇస్తారో లేదో చూడాలి.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఆగ్రహం
అరసవల్లి దర్శనానికి సింగర్ మంగ్లీని తీసుకెళ్లడంపై ట్రోలింగ్
ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని ఎలా తీసుకెళ్తారంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్తలు
ఎన్నికల ప్రచారంలో టీడీపీ పాటలు పాడమంటే పాడలేదని గుర్తు చేస్తున్న తమ్ముళ్లు… pic.twitter.com/wSKviDcc7S
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025