Manchu Vishnu Kannappa:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు(Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa). ఇప్పటికే ఈ సినిమాలో అక్షయ్ కుమార్(Akshay Kumar) మోహన్ లాల్ (Mohan lal), ప్రభాస్(Prabhas ), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తదితరులు భాగమయ్యారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్నీ కూడా పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar Singh) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్లస్, మైనస్ లు ఇవే అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అదేంటో ఇప్పుడు చూద్దాం.
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు మంచు విష్ణు తో పాటు భారీ తారాగణం కూడా ఇందులో భాగమైంది. ఇకపోతే తారలు ఎంత పెద్ద వారైనా వారిని వాడుకోవడంలోనే అసలైన కిక్ ఉంటుంది. అయితే కన్నప్ప సినిమాలో మిగతా వారందరినీ పక్కన పెడితే, ప్రభాస్ పాత్ర మాత్రం కరెక్ట్ గా క్లిక్ అయితే చాలు మిగతాదంతా ప్రభాస్ అభిమానులే చూసుకుంటారు. అయితే ఈ సినిమాలో స్టార్స్ ను తీసుకున్నారు కానీ వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు? అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇకపోతే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాకు భారీ ప్లస్ అయ్యేటట్టు కనిపిస్తోంది. కచ్చితంగా సినిమాపై బజ్ పెంచేందుకు భారీ ఓపెనింగ్ తీసుకొచ్చేందుకు కూడా ఈ భారీ తారాగణం సహకరిస్తుంది. అంతేకాదు ప్రతి భాషా ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరిని తీసుకుంటున్న నేపథ్యంలో అన్ని భాషా ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇంత పెద్ద భారీ తారాగణాన్ని ఈ సినిమాలో భాగం చేశారు కాబట్టి వారి క్రేజ్ కి తగ్గట్టుగా వారి పాత్రలను కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తే మాత్రం, సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ స్టార్సే ఈ సినిమాకు ప్లేస్ అయినా.. ఈ పాత్రలు డిజైన్ చేసిన విధానం అలాగే వారి నిడివి కూడా సినిమా రిజల్ట్ పైన ఆధారపడుతుంది అనేది చిత్ర బృందం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెలబ్రిటీలు అనేవారు ఈ సినిమాకి ఎంత ప్లేస్ అవుతున్నారో వారి పాత్రలు కూడా అంతే హైలెట్ అవ్వాలి.. కానీ కాస్త బోల్తా పడితే అంతే మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు.
ఇకపోతే మొన్నా మధ్య ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అందుకే ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులలో కొత్త జోష్ నింపడానికి మరో టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఒక్కో ఇండస్ట్రీ నుండి నటీనటులను తీసుకోవడం వెనుక మంచు విష్ణు ప్లానెట్ వర్కౌట్ అయ్యింది కానీ వీరందరినీ కూడా ఈవెంట్స్ కి పిలిపించి ఒకే వేదికపై అందరిని కలిపితే మాత్రం సినిమాకి బజ్ మరో లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. మంచు విష్ణు ఏం చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా మైనస్ ల విషయానికి వస్తే.. పాత్రలను రివిల్ చేశాడు కానీ ఆ పాత్రలు ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఈ పోస్టర్లే మెప్పించలేదంటే సినిమాలో నటీనటుల పాత్రలను ఏ మేరకు తీర్చిదిద్దారో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా ఆడియన్స్ను మెప్పిస్తుందో చూడాలి.