Adani Founda Financial Assisitance: ఏపీ వరద బాధితుల కోసం విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. పలువురు ప్రముఖులు, సినీ రంగానికి చెందినవారు, పారిశ్రామిక వేత్తలు భారీ స్థాయిలో వరద సాయం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో ఆ ఫౌండేషన్ ఏపీ వరద బాధితుల కోసం ఆర్థిక సాయం చేసింది.
వరద బాధితుల కోసం అదానీ ఫౌండేషన్ రూ. 25 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది. అందుకు సంబంధించిన లెటర్ ను అదానీ పోర్ట్స్, సెజ్ కంపెనీ ఎండీగా ఉన్న అదానీ కరన్ గురువారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
Also Read: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే
ఇదిలా ఉంటే.. ఇటీవలే భారీ స్థాయిలో వర్షాలు, వరదలు వచ్చి ఏపీని మొత్తం అతలాకుతలం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎటు చూసినా వర్షాలు, వరదలే కనిపించాయి. పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ముంచెత్తడంతో ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో పలువురు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వరదల్లో పశువులు, మూగజీవాలు సైతం కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి. విజయవాడలో అయితే పరిస్థితి అధ్వాన్నంగా మారింది. విజయవాడ పూర్తిగా బుడమేరు వరదలో తేలియాడింది. ఎప్పుడూ లేనంతగా ఈసారి వర్షాలు పడడంతో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. ఈ క్రమంలో బుడమేరు గతంలో ఎప్పుడు లేనంతగా పొంగిపొర్లింది. దీంతో ఆ వరద నీరంతా కూడా విజయవాడకు వచ్చి చేరింది.
దీంతో విజయవాడ ఆ వరద నీటిలో మునిగిపోయింది. వరద బాధితులు సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేశారు. తమను కాపాడాలంటూ ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించింది. సహాయక చర్యలను చేపట్టి ప్రాణనష్టం ఎక్కువ స్థాయిలో జరగకుండా చర్యలు తీసుకుంది. అటు వరదల్లో చిక్కుకున్నవారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి వారిని ఆదుకుంది. అనంతరం వారికి ఆహారపు ప్యాకెట్లను అందజేసింది.
నీళ్లు, పాలు, బిస్కెట్లను అందజేసింది. ఒక్కోరోజు రెండు రోజులు కాదు.. ఏకంగా వారం రోజులపాటు వారికి ఆహారం అందజేసింది. పలు ప్రాంతాల్లో అయితే, సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. అయినా కూడా అధికారులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సహాయక చర్యలను విజయవంతంగా చేపట్టగలిగారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పదిరోజుల పాటు విజయవాడలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు.
Also Read: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని
అదేవిధంగా ఇటీవల వారికి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఇంటికి రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అదేవిధంగా రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు. ఇటు పారిశ్రామిక రంగాలకు చెందినవారిని కూడా ఆదుకుంటామని తెలిపారు. ఆటో డ్రైవర్లు, అటు కోళ్ల ఫారాల వారితోపాటు వరద బాధితులందరికీ ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.