10 Years For Aagadu: కొన్ని సినిమాలు టీజర్లు ట్రైలర్లు చూసినప్పుడు అవి ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అని చాలామందికి అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. తీరా సినిమాలు థియేటర్లో చూసేసరికి నీరసను తీసుకొస్తాయి. ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ నమోదు చేసుకుంది ఆ సినిమా. మహేష్ బాబు లోని టైమింగ్ ను పర్ఫెక్ట్ గా యూస్ చేసి అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు మహేష్ కెరియర్ కి అందించాడు.
థియేటర్లో ఆగలేదు
అయితే వెంటనే వీరి కాంబినేషన్లో మరొకసారి ఆగడు అనే సినిమాను తెరకెక్కించారు. పేరుకు తగ్గట్లు గానే ఈ సినిమా థియేటర్లో ఎక్కువ రోజులు ఆగకుండా ఆడకుండా వెళ్ళిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు అనగానే ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్ లో పెరిగిపోయాయి. కలని ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీటిలోని డైలాగ్స్ అవతల హీరోలకి కౌంటర్స్ లో అనిపించాయి. ఇక ఇవన్నీ కూడా భారీ అంచనాలను పెంచాయి ఇక తీరా థియేటర్ లో చూస్తే ఈ సినిమా పూర్తి నిరాశను మిగిల్చింది.
దూకుడు కంటే ముందు వచ్చుంటే బాగుండేది
వాస్తవానికి ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ దీనికంటే ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా అద్భుతమైన హిట్ అయింది. సో ప్రేక్షకులంతా కూడా దూకుడు మించి ఈ సినిమా ఉండబోతుంది అని ఊహించుకున్నారు. ఆ స్థాయిని ఈ సినిమా అందుకోలేదు కాబట్టి ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఒకవేళ దూకుడు సినిమా కంటే ముందు ఆగడు సినిమా రిలీజ్ అయి ఉంటే అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. అసలు మహేష్ బాబు లోని పరిపూర్ణమైన కామెడీ టైమింగ్ ను బయటికి తీసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఖలేజా సినిమా ప్లాప్ అయ్యింది కానీ ఆ సినిమాతోనే మహేష్ లో సరికొత్త నటుడు బయటకు వచ్చాడు.
ప్రకాష్ రాజ్ తో గొడవ
ఇక ఆగడు సినిమా కథతో పాటు వినోదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. మామూలుగా శ్రీనువైట్ల సినిమాలు అంటేనే ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఈ సినిమాలో క్విజ్ ఎపిసోడ్స్ అలానే బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఇవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి. ఈ సినిమా విషయంలో కొద్దిపాటి వివాదాలు కూడా ఎదురయ్యాయి. అప్పట్లో ప్రకాష్ రాజ్ కి శ్రీనువైట్లకి మధ్య చాలా గొడవలు కూడా నడిచాయి. ప్రకాష్ రాజు శ్రీను వైట్ల కోసం రాసిన కవితను ఈ సినిమాలో పెట్టడం కూడా జరిగింది. ఏదేమైనా బాద్షా సినిమా తర్వాత ఇప్పటివరకు శ్రీను వైట్ల కూడా సరైన హిట్ సినిమాను అందుకోలేకపోయాడు. నేటికీ ఆగడు సినిమా థియేటర్లో ఆడకుండా వెళ్లిపోయి పదేళ్లయింది.