BigTV English

Attack on RTC Driver : సినిమా స్టైల్లో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. రాజమండ్రిలో ఘటన

Attack on RTC Driver : సినిమా స్టైల్లో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. రాజమండ్రిలో ఘటన

Attack on RTC Driver : సినిమా స్టైల్ లో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేయడం తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జీపుతో బస్ ను ఛేజ్ చేసి మరీ అడ్డగించి.. ఆరుగురు యువకులు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ కి గాయాలు కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు.. రాజమండ్రి నుంచి నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం బయలుదేరింది. కాగా మార్గం మధ్యలో స్థానికుడైన సువ్వాడ గోవిందరాజు ద్విచక్రవాహనంపై బస్సుకు అడ్డంగా వచ్చారు. దాంతో బస్ డ్రైవర్ నాగరాజుకి – గోవిందరాజుకి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. చుట్టుపక్కలవాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే గోవిందరాజుతో పాటు తన ఫ్రెండ్స్ మరికొందరు సినిమా స్టైల్ లో బస్సును వెంబడించారు. నిడదవోలు గణపతి సెంటర్ వద్ద బస్సుకు జీపును అడ్డంగా పెట్టి.. డ్రైవర్ ను చితకబాదారు. వెంటనే స్థానికులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక జరిగిన విషయంపై డ్రైవర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాడి చేసిన ఆరుగురుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×