BigTV English

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..

Andhra Pradesh : తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీలో తెలుగు తమ్ముళ్లు జోష్‌లో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో కేసీఆర్‌ ఓటమిని ప్రస్తావిస్తూ.. జగన్‌కు కూడా అదే గతి పడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కొద్దో గొప్పో అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌నే ప్రజలు ఓడించారని.. అలాంటి ఏపీలో ఏమాత్రం అభివృద్ధి చేయని జగన్‌కు జనం ఓటమి రుచి చూపిస్తారని ధీమాలో ఉన్నారు. తెలంగాణ, కర్ణాటన మాదిరే ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు.


మరికొన్ని రోజుల్లోనే ఏపీలోనూ ప్రజా క్షేత్ర యుద్ధం జరగనుంది. అధికారంపై కన్నేసిన చంద్రబాబు తిరిగి సీఎం సీటును దక్కించకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అవకాశం దొరికినప్పుడల్లా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ వర్సెస్‌ టీడీపీ పొలిటికల్‌ వార్‌లో భాగంగా తెలంగాణ ఫలితాలను వాడుకుంటున్నారు టీడీపీ అధినేత. పక్కరాష్ట్రాల మాదిరి ఏపీలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్‌ కు ఓటమి తప్పదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ ఓటమి టీడీపీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఏపీ వాసులు కూడా మార్పు కోరుకుంటే తమదే అధికారమన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు.


Related News

AI In Tirumala: ఆగమ శాస్త్రానికి విరుద్ధం.? కొండపై AI తో లాభమా.? నష్టమా.?

AP Politics: కాంగ్రెస్ నుంచి జగన్‌కు సంకేతాలు.. షర్మిలతో చేయి కలుపుతారా? ఏపీలో హాట్‌గా చర్చ

Pulivendula ZPTC Councing: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Big Stories

×