E-Paper
Advertisement

Saikrishna lock-up death case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. దర్యాప్తు స్పీడ్ పెంచిన సిట్, కానిస్టేబుల్ అరెస్ట్

Saikrishna lock-up death case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. దర్యాప్తు స్పీడ్ పెంచిన సిట్, కానిస్టేబుల్ అరెస్ట్
Advertisement

Saikrishna lock-up death case: ఏపీలో సంచలనం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు అరెస్టు కావడంతో మిగతా వారిపై ఫోకస్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు అధికారులు. ఇంకా ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందనేది ఆసక్తికరంగా మారింది.

విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు స్పీడ్

Advertisement

ఏపీలో సంచలనంగా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది సిట్. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. ఇదిలాఉండగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.

పోలీసుల థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోపణలు నిజమని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశం ఉంది. లాకప్‌లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ జరగడం వెనుక బాబురావు కీలక పాత్ర పోషించినట్లు గట్టి ఆధారాలు సేకరించింది సిట్.

Advertisement

కానిస్టేబుల్ బాబురావుని అరెస్ట్ చేసిన అధికారులు, మరో కొందరు కూడా

సాయికృష్ణను విచక్షణారహితంగా కొట్టడంతో మరణించాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని గతంలో పోలీసులను ఆదేశించిన విషయం తెల్సిందే.

ఈలోగా ప్రభుత్వం సిట్ వేయడంతో దర్యాప్తులో పోలీసులు సాయికృష్ణను కొట్టి చంపిన విషయం బయటపడింది. అప్పటివరకు మిస్సింగ్ కేసు‌గా ఉన్న ఈ కేసు లాకప్ డెత్‌గా మారింది. మరోవైపు ఈ కేసులో మరికొందరు అరెస్టు కావచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరు పోలీసులు ఉండే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

ALSO READ: అక్కడ వచ్చింది గొడ్డలి ఫ్యాక్టరీలే.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై భూమిరెడ్డి హాట్ కామెంట్స్!

Related News

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×