E-Paper
Advertisement

iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!
Advertisement

iPhone 18 Leaks: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే ఐఫోన్ కొత్త సిరీస్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. సాధారణంగా Pro మోడల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యాపిల్.. ఈసారి రాబోయే iPhone 18 బేసిక్ వేరియంట్‌లో కూడా అదిరిపోయే మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ విశ్లేషకుడు జెఫ్ పూ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఐఫోన్‌లో డిజైన్ పరంగానే కాకుండా.. పనితీరు విషయంలోనూ పెద్ద అప్‌గ్రేడ్స్ చూడబోతున్నాం.

డిజైన్‌లో సరికొత్త మార్పులు:

ఐఫోన్ స్క్రీన్ పైన ఉండే ‘డైనమిక్ ఐలాండ్’ పరిమాణం ఈసారి గణనీయంగా తగ్గనుంది. ఇప్పటివరకు ఉన్న సైజులో దాదాపు మూడో వంతుకు దీన్ని తగ్గించే ఆలోచనలో యాపిల్ ఉంది. స్క్రీన్ కింద ఇన్‌డిస్‌ప్లే ఇన్ఫ్రారెడ్ ప్రొజెక్టర్ సాంకేతికతను వాడటం ద్వారా ఫేస్ ఐడీ సెన్సార్ల విస్తీర్ణాన్ని తగ్గించనున్నారు. దీంతో స్క్రీన్ పైన డిస్‌ప్లే స్పేస్ మరింత పెరిగి, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ వాడుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Advertisement

Also Read: లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

భారీగా పెరగనున్న ర్యామ్:

ఈసారి ప్రాసెసింగ్ వేగం పెంచడానికి యాపిల్ ర్యామ్ సామర్థ్యాన్ని పెంచుతోంది. iPhone 18 మోడల్‌లో ఏకంగా 12GB ర్యామ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది Pro మోడల్స్ ర్యామ్‌తో సమానం కావడం విశేషం. ఇక బడ్జెట్ వేరియంట్‌గా వచ్చే iPhone 18eలో 9GB ర్యామ్ అందించవచ్చు. దీంతో ఫోన్ మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.

పవర్‌ఫుల్ AI ఫీచర్లు:

Advertisement

ఎక్కువ ర్యామ్ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన కారణం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు. ఫోన్‌లోనే నేరుగా పనిచేసే పవర్‌ఫుల్ AI ఫీచర్లను అందించాలంటే ఎక్కువ మెమరీ అవసరం. ఈ అప్‌గ్రేడ్ వల్ల భవిష్యత్తులో రాబోయే భారీ AI టాస్క్‌లను ఈ ఫోన్లు సులభంగా హ్యాండిల్ చేయగలుగుతాయి.

మార్కెట్‌లోకి ఎప్పుడు రావచ్చు?

సాధారణంగా ప్రతి ఏటా సెప్టెంబర్‌లో Pro మోడల్స్ విడుదలవుతాయి. అయితే సాధారణ iPhone 18, 18e మోడల్స్ మాత్రం 2027 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ లీకైన వార్తలే అయినప్పటికీ.. ఇవి నిజమైతే మాత్రం సాధారణ ఐఫోన్ యూజర్లకు ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

Also Read: షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×