E-Paper
Advertisement

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!
Advertisement

Ananthababu: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో భాగంగా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పోలీసులు ఆయనను కడా భద్రత నడుమ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.

కోర్టులో సాక్షుల విచారణ

Advertisement

ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ ముగ్గురు సాక్షులను కోర్టు విచారించింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు విచారించిన సాక్షుల సంఖ్య 14కి చేరింది. మొత్తం 87 మంది సాక్షులు ఉండగా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల (ఆగస్టు) 31వ తేదీ నాటికి సాక్షుల విచారణ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అందుకనుగుణంగానే రోజువారీ విచారణ వేగవంతంగా సాగుతోంది.

మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు

Advertisement

ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలను మండలిలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, అందుకోసం తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు దరఖాస్తు దాఖలు చేశారు.

బెయిల్ ఇవ్వొద్దని బాధితుల లాయర్ వినతి

అయితే అనంతబాబుకు ఎలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని బాధితుల తరఫు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కోర్టును తీవ్రంగా కోరారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కోణాన్ని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. అనంతబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వెల్లడించారు.

Also Read: మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ చేసిన జిల్లా కోర్టు!

Tags

Related News

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్

ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! సభకు రాకపోతే జీతాల్లేవ్.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×