E-Paper
Advertisement

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు
Advertisement

Amaravati: రాష్ట్రానికి ఎటు చూసినా సరైన రాజధాని అమరావతి అని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు. విజయవాడ లేదా గుంటూరులో 50 ఎకరాలు తీసుకుని సెక్రటేరియట్ కట్టేయొచ్చని, మామూలుగా ఉంటుందన్నారు. భవిష్యత్తును ఆలోచించే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చానని మనసులోని మాట బయటపెట్టారు. దీన్ని మహానగరం చేయాలని అనిపించిందని చెప్పుకొచ్చారు.

 

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన సీఎం

Advertisement

రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వామ్యులను చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించామన్నారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలను ఆలోచించినప్పుడు మీరంతా వచ్చారన్నారు. ఆనాడు సైబరాబాద్ నిర్మాణం చేయకుండా ఉంటే.. మీరు భూములు ఇచ్చేవారు కాదని, నా మీద నమ్మకం ఉండేది కాదన్నారు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ నిర్మాణం చేస్తే.. మా జీవితాలు బాగుపడతాయని మీరంతా ముందుకు వచ్చిన భూములు ఇచ్చారని చెప్పారు. దాదాపు రెండు నెలల్లో 29 వేల మంది రైతులు దాదాపు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు.

 

గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

Advertisement

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదన్నారు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారణమైన అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టారు.. అది మహానగరం అయ్యిందని, హంబుల్‌గా మొదలు పెట్టారంటే బాగుంటుందని రైతులు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమేనని అన్నారు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మిస్తే.. ఏమి వస్తుందని చాలామంది అన్నారని, ప్రపంచంలో వివిధ కంపెనీల అధినేతలకు షో చేస్తున్నారని దానివల్ల ఏమీ రాదని ఎద్దేవా చేశారన్నారు. తెలుగు జాతి గర్వపడేలా ఒక మహానగరం నిర్మాణం చేయాలని సంకల్పంతో హైటెక్ సిటీ నిర్మాణం చేశామన్నారు.

 

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు

ఇప్పుడు హైదరాబాద్ సిటీని మీరు చూస్తున్నారని అన్నారు. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సీడ్ యాక్సెడ్ రోడ్డును సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి కావడంతో దీన్ని ఆపడం ఎవరి తరం కాదని ఒకాయన చెప్పారని వివరించారు. చివరకు చిన్న భూమికి సంబంధించి ఓ రైతు ద్వారా ఆపడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేం జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఇలాంటి వారివల్ల రాష్ట్రానికి చాలా ప్రమాదమని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అమరావతిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ: శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్.. సీఎం చంద్రబాబు కరణ్ అదానీ భేటీ

Related News

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్

ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! సభకు రాకపోతే జీతాల్లేవ్.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏపీ రాజకీయాల్లో కొత్త అంకం.. అలర్టయిన కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల సంయుక్త ప్రకటన

Big Stories

Advertisement
×