E-Paper
Advertisement

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి
Advertisement

Kurnool Jail: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఏ జిల్లాకు వెళ్లినా ఒకటే రచ్చ. తనకు సెక్యూరిటీ ఇవ్వలేదు, పోలీసు అధికారులు ఇబ్బందిపెట్టారు అని పదేపదే చెబుతుంటారు. లేనిపోని అబద్దాలు చెప్పిన ప్రజల్లో తనపై మైలేజీ క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గంటల వ్యవధిలో ఆయన చెప్పిన మాటలకు కౌంటర్లు పడిపోతాయి. గురువారం కర్నూలు జిల్లా జైలులో అదే జరిగింది. జగన్ చేసిన ఆరోపణలపై జైలు అధికారి క్లారిటీ ఇచ్చారు?

 

కర్నూలు జైలు వద్ద ఏం జరిగింది?

Advertisement

కర్నూలు జిల్లా జైలు వద్ద మాజీ సీఎం జగన్‌కు అవమానం జరిగిందన్న ప్రచారంపై జైలు అధికారుల వివరణ ఇచ్చారు. దీనిపై జైలు పర్యవేక్షణాధికారి వేణుగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫోటో తీసినట్లు స్పష్టం చేశారు. ప్రతి సందర్శకుడి ఫోటో తీయడం తప్పనిసరి తెలియజేశారు. ఈ-ప్రిజన్స్ సాఫ్ట్‌వేర్‌లో ప్రతి ఖైదీ ములాఖత్‌కు సంబంధించినవారి ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇద్దరు రిమాండ్ ఖైదీలతో జగన్ ములాఖత్ అయ్యారని, అందుకే ఆయన ఫోటో రెండుసార్లు తీసినట్లు వెల్లడించారు.

 

జైలు నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Advertisement

ఆర్పీ నంబర్ 1534 బుసినే విరూపాక్షి, ఆర్పీ నంబర్ 1564 బుసినే శ్రీరాములతో జగన్ ములాఖత్ జరిగినట్టు వివరించారు. గురువారం సాయంత్రం 3.50 గంటలకు జైలులోకి జగన్ వెళ్లినట్టు తెలిపారు. 4.20 గంటల వరకు ఇద్దరు ఖైదీలతో ములాఖత్ అయినట్టు తెలిపారు. ములాఖత్ సమయంలో జగన్‌తో అధికారులు, సిబ్బంది ఎక్కడా అమర్యాదగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించలేదని జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. అధికారులు క్లారిటీ ఇవ్వడంతో జగన్ కర్నూలు జైలు ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడింది.

 

వైసీపీ అధికార గెజిట్ ఏం రాసింది?

వైసీపీ అధికారి గెజిట్‌లో తాటికాయంత అక్షరాలతో రాసుకొచ్చింది. ములాఖత్ సమయంలో జైలులో నిలబెట్టి వీడియోలు తీసి నన్ను అవమానించారని  పేర్కొంది. ఇలా ఎందుకు చేస్తున్నారని జైలు అధికారులను ప్రశ్నిస్తే.. పైనుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పినట్టు మీడియా ముందు కొచ్చారు. సీఎం చంద్రబాబు తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని, ఆయన శాడిజానికి ఇదొక పరాకాష్టగా ప్రస్తావించారు. ఇంత రాసిన గెజిట్.. జగన్ జైలు వద్దనున్న ఫోటోలను ప్రచురించలేదు. కేవలం వాహనాల్లో వచ్చినప్పుడు మాత్రమే కనిపించాయి.

ALSO READ: అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! దాన్ని షేర్ చేసిన సీఎం చంద్రబాబు

దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు. అధికారం పోయిన తర్వాత నేతలను పరామర్శించడానికి జగన్ పలుమార్లు జైలుకి వెళ్లారని అంటున్నారు. ఆ నిబంధనలు ఆనాడూ ఉన్నాయని, ఇప్పుడు ఉన్నాయని చెబుతున్నారు. కాకపోతే ఆయన వచ్చిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి కొత్త సీన్ క్రియేట్ చేశారని అంటున్నారు. మొత్తానికి అధికారులు క్లారిటీ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడింది.

Related News

విశాఖలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య.. విచారణకు మంత్రి ఆదేశం, మృతురాలి సొంతూరు హైదరాబాద్

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!

చంద్రబాబు విదేశీ పర్యటనలపై.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!

కావలి జనసేనలో పాత-కొత్త నేతల ఆధిపత్య పోరు.. సుకుమార్ రెడ్డి చేరికపై రగులుతున్న అసంతృప్తి!

పరిపాలన గాలికి వదిలేశారు.. అన్నీ సెటిల్‌మెంట్లే!- బొత్స సత్యనారాయణ

డ్రైవింగ్ లైసెన్స్‌ ఆశావహులకు శుభవార్త.. ఇంటి నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష.. ఏపీలో కొత్త విధానం

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. రాగల 12 గంటల్లో ఏపీకి వర్షసూచన

Big Stories

Advertisement
×