Adam Gilchrist On Ban VS Aus: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కంగారుల దెబ్బకు బంగ్లాదేశ్, దెబ్బతింటుందని అందరూ అనుకుంటే… సీన్ మొత్తం రివర్స్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి, కంగారులు చతి కలపడ్డారు. ఒకరంటే ఒక్కరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. స్టీవ్ స్మిత్ మినహా ఏ ఒక్కరు సరిగ్గా నిలబడలేకపోయారు. ఈ క్రమంలోనే 198 పరుగులకు కుప్పకూలింది ఆస్ట్రేలియా. అయితే మొదటి టెస్ట్ పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ దూకుడు చూస్తుంటే, ఆస్ట్రేలియా ఓడిపోయేలా కనిపిస్తోందని బాంబు పేల్చారు. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలని కోరారు.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) మధ్య తొలి టెస్ట్ ( Bangladesh tour of Australia,) జరుగుతున్న నేపథ్యంలో.. కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ సందర్భంగా మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 198 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. స్టీవ్ స్మిత్ 71 పరుగులు చేయగా… మిగిలిన ఆటగాళ్లు తేలిపోయారు. హసన్ మహమూద్ అద్భుతమైన బౌలింగ్ చేసిన నేపథ్యంలో ఆరు వికెట్లు పడగొట్టాడు.
అటు టాస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా హుస్సేన్ కూడా రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను దెబ్బతీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 153 పరుగుల లీడ్ కూడా ఇప్పటికే సంపాదించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయిన బంగ్లాదేశ్ 351 పరుగులు సాధించింది. రేపు కూడా బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేయనుంది. మరో 100 నుంచి 200 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
మొదటి టెస్ట్ నేపథ్యంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ఊపు చూస్తుంటే కంగారులను ఓడించేలా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్లో కూడా వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. బంగ్లాదేశ్ క్రికెటర్ల ఆట చూసి తాను ఆశ్చర్య పోయానని వ్యాఖ్యానించారు. గతంలో బంగ్లాదేశ్ ఇలా ఎప్పుడు ఆడలేదని.. సరికొత్త ప్రదర్శనతో ఇరగదీస్తున్నట్లు ప్రశంసించారు గిల్ క్రిస్ట్. బంగ్లాదేశ్ జట్టును సులభంగా గెలుస్తామని కంగారులు భావించారని.. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టినట్లు వ్యాఖ్యానించారు. సీన్ రివర్స్ కాగానే, ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని బాంబు పేల్చారు. ఇకనైనా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఆడాలని కోరారు.