E-Paper
Advertisement

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?
Advertisement

Seed Access Road S-Bend: ఏపీ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రజలకు అంకింత చేస్తూ ఉండవల్లి వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే స్టీల్ బ్రిడ్జి వద్ద ఉన్న ఒక ప్రత్యేకమైన వంపు (S-bend) ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోడ్డును నేరుగా నిర్మించకుండా.. ఈ ఒంపు ఎందుకంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయితే రోడ్డును ‘S’ ఆకారంలో నిర్మించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ రోడ్డు వంపు ఉన్న వెనుక ఉన్న కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

భవిష్యత్ ఎలివేటెడ్ కారిడార్

సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో పెరిగే రద్దీని ముందే ఓ అంచనా వేసి.. దీన్ని రూపొందించారు. దొండపాడు నుండి తాడేపల్లి వరకు చేపట్టబోయే భారీ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ను ఫైనల్ చేశారు. అందువల్లనే భవిష్యత్ అనుసంధానానికి వీలుగా ఈ మార్పు చేశారు.

Advertisement

రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ఉన్నదే..!

సీడ్ రోడ్డులోని ఈ వంపును అకస్మాత్తుగా తీసుకొచ్చారనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. నేరుగా రోడ్డు వేస్తే ఆ మార్గంలోని టీడీపీ నేతల స్థలాలు, ఆస్తులు పోతాయని ఇలా వంపు తిప్పుతూ రోడ్డు నిర్మించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. ఇది హఠాత్తుగా మార్చిన డిజైన్ కాదని స్పష్టం చేస్తున్నారు. నిజానికి 2017లో సింగపూర్ నిపుణుల సహకారంతో రూపొందించిన అమరావతి ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. మాస్టర్ ప్లాన్‌లోని అలైన్‌మెంట్ మార్గదర్శకాలను ఇంజనీరింగ్ తూచ తప్పకుండా పాటిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

Advertisement

3 దశాల్లో రోడ్డు నిర్మాణం..

సీడ్ యాక్సిస్ రహదారిని మెుత్తం మూడు దశల్లో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో దొండపాడు నుండి వెంకటపాలెం వరకు (14.35 కి.మీ, రెండో దశలో వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకూ, మూడో దశలో ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్, NH-16కి అనుసంధానం చేయనున్నారు. మూడో దశ పనుల్లో భాగంగానే బకింగ్ హామ్ కాలువపై స్టీల్ వంతెనను నిర్మించారు. దీనినే సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించడం గమనార్హం. ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా, వాహనాలు సులభంగా మలుపులు తిరిగేందుకు వీలుగా వంపు డిజైన్‌ను నిర్మించారు.

Also Read: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

భద్రతాపరమైన కారణాలు..

అయితే రోడ్లపై ‘ఎస్’ (S) ఆకారపు వంపులను (Reverse Curves) ఏర్పాటు చేయడం వెనుక భద్రతాపరమైన కారణాలు సైతం దాగున్నాయి. ఒకవేళ వాహనాలు ఒకే వేగంతో నేరుగా వెళ్లేటప్పుడు డ్రైవర్లు ఏకాగ్రత కోల్పోయి ‘హైవే హిప్నాసిస్’కు గురయ్యే ప్రమాదం ఉంది. అదే ‘S’ వంపులు ఉంటే డ్రైవర్లు అప్రమత్తమై వేగాన్ని అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. అలాగే కొండ ప్రాంతాలు, నదులు, వంతెనల వద్ద ఆకస్మిక ఎత్తుపల్లాలను (Gradients) తగ్గించి.. మార్గాన్ని సాఫీగా మార్చేందుకు కూడా ‘సూపర్ ఎలివేషన్‌’తో కూడిన ఈ ‘S’ వంపు సహాయపడుతుంది.

Also Read: స్టీరింగ్ గేర్ వైఫల్యం.. తీరానికి దూసుకొచ్చిన భారీ నౌక.. ఒడ్డున ఉన్నోళ్లు పరుగో పరుగు!

Tags

Related News

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్

ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! సభకు రాకపోతే జీతాల్లేవ్.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×