E-Paper
Advertisement

25 కి.మీ మైలేజ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్ సేఫ్టీ.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!

25 కి.మీ మైలేజ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్ సేఫ్టీ.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!
Advertisement

Best Automatic Cars Under Rs.10 Lakh: దేశంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో క్లచ్, గేర్ మార్చే ఇబ్బంది లేకుండా కారును నడపాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే, ఆటోమేటిక్ కారు అనగానే ధర ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ, రూ.10 లక్షల లోపు బడ్జెట్‌ లోనే మంచి మైలేజ్, భద్రతా ఫీచర్లు, సౌకర్యాలు ఉన్న కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన నాలుగు మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా పంచ్: రూ.7.54 లక్షలు

బడ్జెట్‌ లో ఆటోమేటిక్ SUV తరహా కారు కావాలనుకునేవారికి టాటా పంచ్ మంచి ఆప్షన్. దీని ఆటోమేటిక్ రేంజ్ ప్యూర్ ప్లస్ AMT వేరియంట్‌ తో ప్రారంభమవుతుంది. దీని ధర సుమారు రూ.7.54 లక్షలు(ఎక్స్‌ షోరూమ్). పంచ్‌ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ AMT గేర్‌ బాక్స్ ఉంటుంది. టచ్‌ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్, డ్రైవింగ్ పరిస్థితులను బట్టి సుమారు 18.8 నుంచి 20.09 కిమీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

మారుతి స్విఫ్ట్: 25.75 కిమీ మైలేజ్

Advertisement

తక్కువ ధరలో మంచి మైలేజ్ కోరుకునేవారికి మారుతి సుజుకి స్విఫ్ట్ మరో బెస్ట్ ఆప్షన్. దీని ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు సుమారు రూ.7.04 లక్షల నుంచి రూ.8.65 లక్షల వరకు ఉన్నాయి. కొత్త స్విఫ్ట్‌ లో 1.2 లీటర్ Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ESP లాంటి భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌ గా ఉన్నాయి. సుజుకి కనెక్ట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 25.75 కిమీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

స్కోడా కైలాక్: రూ.9.25 లక్షలు

కొంచెం ప్రీమియం లుక్, టర్బో ఇంజన్, మంచి భద్రత కావాలనుకునేవారు స్కోడా కైలాక్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.  దీని క్లాసిక్ ప్లస్ AT వేరియంట్ ధర సుమారు రూ.9.25 లక్షలు (ఎక్స్‌ షోరూమ్). కైలాక్‌లో 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ యాడ్ చేశారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్ సుమారు 19.05 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా అమేజ్: సౌకర్యవంతమైన సెడాన్

Advertisement

SUV కాకుండా సెడాన్ కావాలనుకునే కుటుంబాలకు హోండా అమేజ్ మంచి ఆప్షన్. దీని V పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారు రూ.9.81 లక్షలు (ఎక్స్‌షోరూమ్). 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ప్యాడిల్ షిఫ్టర్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, హోండా సెన్సింగ్ ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని మైలేజ్ సుమారు 19.46 కిమీ.

Read Also: 145 కి.మీ రేంజ్ తో కొత్త స్కూటర్.. ధర కూడా తక్కువేనండోయ్!

Tags

Related News

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

Big Stories

Advertisement
×