E-Paper
Advertisement

AP Politics: దూరంగా సీనియర్లు.. సజ్జల మాటలు దేనికి సంకేతం, వైసీపీలో చర్చ

AP Politics: దూరంగా సీనియర్లు.. సజ్జల మాటలు దేనికి సంకేతం, వైసీపీలో చర్చ
Advertisement

AP Politics: వైసీపీలో సీనియర్లను జగన్ దూరంగా పెడుతున్నారా? వచ్చే ఎన్నికల నాటికి యువతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే పార్టీ కార్యక్రమాలకు సీనియర్ల దూరంగా ఉంటూ వస్తున్నారా? వారిని ఉత్సాహపరిచేందుకు సజ్జల రంగంలోకి దిగారా? ఆదివారం సజ్జల మాటలు దేనికి సంకేతం? దీనిపై వైసీపీలో ఇంటబయటా చర్చ జరుగుతోంది.

సజ్జల మాటలు దేనికి సంకేతం

Advertisement

ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు సీనియర్లు. కావాలనే వారిని జగన్ దూరంగా పెట్టారా? యువతకు ప్రయార్టీ ఇవ్వాలని భావిస్తున్నారా? అనేది తెలీదు. కాకపోతే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం సీనియర్లను దూరంగా పెట్టారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

విడతల వారీగా జిల్లాల కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గాల సమన్వయకర్తలను ఆ పార్టీ నియమిస్తోంది. కీలక నేతలు తప్పితే మిగతా వారంతా కొత్తవారేని అంటున్నారు. సీనియర్లను ఆ పార్టీ దూరంగా పెట్టినట్టు ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆ పార్టీ తరపున వాయిస్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లలేపోయింది. కేవలం సోషల్‌మీడియా ప్రచారాన్ని నమ్ముకుంటోంది.

Advertisement

వైసీపీలో కొత్త చర్చ

ఆదివారం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్రంలో మళ్లీ అత్యధిక మెజారిటీతో 200 సీట్లు పైచిలుకు గెలిచే అవకాశముందని వెల్లడించారు.

డీలిమిటేషన్‌ జరిగితే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పకనే చెప్పారు. ఒకవేళ సీట్లు పెరగకపోయినా 151 కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. కొన్నాళ్లుగా డీలిమిటేషన్‌పై వైసీపీలో ఎలాంటి చర్చ లేదు. ఇప్పుడే సజ్జల ఎందుకు ప్రస్తావనకు తెచ్చారంటూ వైసీపీలో కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు.

ALSO READ: జగన్‌కు కేసీఆర్ గిఫ్ట్.. వైసీపీ నేతలు ఫుల్ ఎంజాయ్

సజ్జల మాటలు గమనించినవారు, సీనియర్లు యాక్టివేట్ చేయడానికి ఆ విధంగా మాట్లాడి ఉంచవచ్చని అంటున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం.. 2029 లోపు ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ సీట్లను 225 కు పెంచనున్నారు. డీలిమిటేషన్ జరిగితే అదనంగా 50 సీట్లు పెరగనున్నాయి. మొత్తానికి  వైసీపీలో ఏదో జరుగుతోందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాాలి.

Related News

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Big Stories

Advertisement
×