Sajjala-Bhargav: ఏపీలో ఏం జరుగుతోంది? సజ్జల, ఆయన కొడుకు భార్గవ్‌కు కష్టాలు మొదలయ్యాయా? తండ్రీకొడుకులిద్దరు ఎందుకు భయపడుతున్నారా? పోసాని అరెస్ట్‌తో బండారం బయటపడిందని టెన్షన్ పడుతున్నారా? ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారా? పోసాని అనారోగ్యం ఇష్యూ సజ్జల ఆడించిన డ్రామానా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
చేసిన తప్పులు, మోసాలు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వెంటాడుతాయని ఏవరో ఒకరు చెబుతారు. దీనికి ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయం పోసాని అరెస్టుతో నిజమైంది. పోసాని అరెస్ట్‌తో తన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనేది మొత్తమంతా ఊసగుచ్చి పోలీసులకు చెప్పేశారు.
తన వ్యాఖ్యల వెనుక కథ సజ్జల అయితే.. ప్రచారం చేసింది భార్గవ్‌రెడ్డి వెల్లడించారు. అయితే పోసాని రిమాండ్ రిపోర్టు మీడియాకు రావడం కాస్త ఆలస్యమైంది. పోసాని విచారణలో ఏం చెప్పారో ముందుగానే వైసీపీ నేతలకు తెలిసిపోయింది. దీంతో తమకు అరెస్ట్ తప్పదని భావించారు సజ్జల, ఆయన కొడుకు భార్గవ్.
ఎకాఎకీన శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. పోసాని వివాదాస్పద కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అత్యవసరంగా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఇంతకీ న్యాయస్థానంలో అనుకూలంగా సజ్జలకు అనుకూలంగా తీర్పు వస్తుందా? ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకుంటే సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: ఎండలు బాబోయ్ ఎండలు
తామిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులతోపాటు పోసాని మాట్లాడినట్టు పోలీసులు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఓబుళవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. రిమాండ్ రిపోర్టులో తమపై నిర్దిష్టమైన అభియోగాలు లేకపోయినప్పటికీ, రాజకీయ కుట్రతో తమను అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో ప్రస్తావించారు.
న్యాయస్థానంలో సజ్జల, ఆయన కొడుకు భార్గవ్ కు చుక్కెదురైతే అరెస్ట్ కావడం ఖాయమన్నమాట. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు రాజంపేట జైలులో ఉన్న పోసానితో మాట్లాడేందుకు వైసీపీ నేతలు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు.
తనను భయపెట్టి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారని పోసానితో మళ్లీ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో జైలులో ఉన్న పోసాని వద్ద ఆకేపాటి ద్వారా రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. ఆకేపాటితో సమావేశమైన కొద్దిగంటలకే పోసాని తన డ్రామాను మొదలుపెట్టారు. కడుపు, ఛాతీలో నొప్పిగా ఉందని, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మీడియాలో ఒకటే బ్రేకింగ్ న్యూస్.
రాజంపేట వైద్యులు ఆయనను పరీక్షించారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. అయితే పోసాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఉదయం నుంచి ఆయన నాటకం ఆడినట్టు పోలీసులు ఓపెన్‌గా చెప్పేశారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని మళ్లీ రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.
పోసాని కేసును వైసీపీ పెద్దలు తేలిగ్గా తీసుకుంటే ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేసినట్టు? ములాఖత్ పేరుతో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటిని పోసాని వద్దకు ఎందుకు పంపారు? మొత్తానికి ఈ కేసు సెగ తాడేపల్లి ప్యాలెస్‌కు తగిలిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో పోసాని కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.