Intinti Ramayanam Today Episode March 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయ బర్త్ డే ను సెలబ్రేట్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరు శ్రీకర్ కోసం వెయిట్ చేస్తుంటారు. శ్రీకర్ ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్తే బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా చేసేవాళ్లం కదా అని కమల్, అక్షయ్ అంటారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఒక అరగంటలోనే మనం హాల్లో డెకరేట్ చేసి శ్రీయ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్గా చేద్దామని అంటారు.. అప్పుడే శ్రీకర్ఇంటికి వస్తాడు. శ్రియకు బర్త్డే గిఫ్ట్ తీస్తే దాన్ని విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది.. శ్రీయా బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే శ్రీకర్ కూడా రూమ్ లోకి వెళ్తాడు.. శ్రీకరు శ్రియాకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా వినదు అయితే అక్కడే ఉన్న నెక్లెస్ ను చూసి శ్రీకర్ పల్లవి దగ్గరికి తీసుకెచ్చి మొహాన విసిరి కొడతాడు. ఇక పల్లవి శ్రీయానే నెక్లెస్ తీసుకుందని చెప్పడంతో శ్రీకర్ కామ్ అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. శ్రీయ మాత్రం నేనే నెక్లెస్ ని పల్లవి దగ్గర నుంచి తీసుకున్నానని అబద్ధం చెప్తుంది. అందరూ ఒకరి నుంచి వెళ్ళిపోతారు పల్లవి శ్రియ నా బుట్టలో పడిపోయింది బకరాలాగా బలైపోయింది అని సంబరపడిపోతుంది. పార్వతి, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు ఇంట్లో జరుగుతున్న వాటిని తలచుకొని ఫీల్ అవుతారు. అసలు ఇంట్లో ఈ గొడవలు ఎప్పటికీ సద్దుమనుకుతాయో తెలియడం లేదని రాజేంద్రప్రసాద్ బాధపడతాడు..అటు భానుమతి కమలాకర్ ఫోటో చూసి తన మనసులో నీ ప్రేమను బయటపెడుతుంది. కమల్ అదే అదునుగా చూసుకొని భానుమతిని ఆట ఆడుకుంటాడు. ఇక అక్షయ్ మాత్రం అవని కోసం బాధపడుతూ ఉంటాడు ఆరాధ్య అవనికి ఫోన్ చేయమని అడుగుతుంది.
ఆరాధ్య దయాకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది అవనికి ఇవ్వమని అడుగుతుంది. అవనితో అక్షయ్ ఫోన్ మాట్లాడుతాడు. ఆ తర్వాత అవని మాటలు విని అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. ఆరాధ్య అమ్మని ఎప్పుడు తీసుకొద్దాం నాన్న అని అడుగుతుంది ఇంకొద్ది రోజుల్లో తీసుకొద్దామని అంటాడు. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు అటు అవన్నీ కూడా గుడికి వస్తుంది. ముందుగా వాళ్ల పేరు మీద అర్చన చేయండి అని పంతులతో చెప్తుంది అవని. మా అమ్మాయి ప్రణతి నిశ్చితార్థం రేపు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎవరి చూపు పడకుండా మంచిగా జరగాలని దేవుడి దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చామండి అలానే విఘ్నాలు కలగకుండా పూజ చేయండి అని పంతులు గారికి పార్వతి చెప్తుంది..
అది విన్న అవని ప్రణతి వైపు చూస్తుంది కానీ ప్రణతి మాత్రం అవని ఏదో తప్పు చేసినట్లు మొహం అలా తిప్పుకుంటుంది. అయితే అక్షయ్ మాత్రం అవని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ గుడిలో పూజ చేస్తూ ఉంటే అవని బయటకు వెళ్తుంది. అక్షయ్ కూడా అక్కడికి వస్తాడు. అవినీతో మాట్లాడుతుంటే అవని మాట్లాడడానికి ఇష్టపడదు. చూశారు కదండీ నేనెంత పరాయిదాన్ని అయిపోయాను. అక్కడ ప్రణతి పెళ్లి అన్న విషయం కూడా నాకు చెప్పడానికి అత్తయ్య ఇష్టపడడం లేదు ప్రణతి కూడా నా మొహం చూడడానికి ఇష్టపడటం లేదు నేను అక్కడి నుండి ఏం చేయాలి అని అవని వెళ్ళిపోతూ ఉంటుంది.
బయట పల్లవి అవనీని ఆపుతుంది. నిన్ను ప్రణతి పెళ్లికి రాకుండా చేస్తానని శపధం చేస్తుంది. నేను అసలు ఇంట్లోకి రానివ్వనని పల్లవి అవనితో అంటుంది దానికి అవని కింద ఉన్న మట్టిని తీసుకొని చేతులు దులుపుకొని పల్లవి చంప మీద ఒకటిస్తుంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసే రోజు వచ్చేసింది నువ్వు వెయిట్ చెయ్ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంతకీ ఇంట్లో నువ్వు ఉంటావో నేనుంటాను చూడాలి అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ప్రోమో కట్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.