BigTV English

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు కోసమే ఏపీలోకి ఎంట్రీ.. షర్మిలపై సజ్జల విమర్శలు..

Sajjala Ramakrishna Reddy : రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదన్నారు. షర్మిల మాట్లాడిన ప్రతీ విషయానికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారన్నారు. ఇక్కడ జరుగుతున్న రాజకీయాల పై ఆమెకు అవగాహన లేదని ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు కోసమే ఏపీలోకి ఎంట్రీ.. షర్మిలపై సజ్జల విమర్శలు..

Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆమె మాట్లాడే వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదన్నారు. షర్మిల మాట్లాడిన ప్రతీ విషయానికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారన్నారు. ఇక్కడ జరుగుతున్న రాజకీయాల‌పై ఆమెకు అవగాహన లేదని ఆరోపించారు.


మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ వైఎస్ కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టిందన్నారు. షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టారని తర్వాత తీసేశారని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఆమె ఏం చేశారు? అని ప్రశ్నలు గుప్పించారు. జగన్ కోసం లక్షలాది మంది ఆనాడు కదిలి వచ్చారని గుర్తు చేశారు. ఓదార్పు యాత్ర వద్దన్నందుకు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారని గుర్తు చేశారు. తిరిగి సొంత బాబాయి వివేకానందరెడ్డితో ఎదురు పోటీ చేయించారని పేర్కొన్నారు. 16 నెలలు అక్రమంగా జగన్‌ను కాంగ్రెస్ జైల్లో పెట్టించిందని.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని చెప్పారని తెలిపారు.

వైఎస్సార్ ఆశయాలు అనుగుణంగా పథకాలు అమలు చేయటం లేదని షర్మిల అనడంలో వాస్తవం లేదన్నారు. ఏవరో రాసి ఇచ్చిన పేజీలను ఆమె చదువుతున్నారని విమర్శలు గుప్పించారు. షర్మిల వ్యాఖ్యలను ప్రజలు అందరు గమనిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ని విమర్శించిన రోజే షర్మిలను ఎల్లోమీడియా భుజాన వేసుకుంది అని మండిపడ్డారు. ఎల్లోమీడియా అంతకుముందు వరకు ఎందుకు షర్మిళ గురించి గొప్పగా రాయలేదు?అని ప్రశ్నించారు. ఇవన్నీ షర్మిలకు ఎందుకు కనపడలేదు? అని ప్రశ్నల వర్షం కురింపించారు సజ్జల.


ఏం ఆశించి అన్న కోసం తిరిగారో షర్మిల చెప్పాలి?అని డిమాండ్ చేశారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీవా? మరెందుకని బీజేపీతో కలిశామని ఆరోపణలు చేస్తారెందుకు అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని తమ ప్రభుత్వం చేయాల్సిన పోరాటం చేసిందని పేర్కొన్నారు. ఏపీలో పోర్టుల గురించి షర్మిల అవగాహన లేకుండా మట్లాడటం సబబు కాదని వ్యాఖ్యానించారు. మణిపూర్ అంశంపై తెలంగాణలో ఉన్నప్పుడు ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిల మాట్లాతున్నారని సజ్జల ఆరోపించారు. ఏపీకి షర్మిలను స్వలాభాం కోసమే చంద్రబాబు తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసమే చంద్రబాబు షర్మిలను ఏపీకి రప్పించారని విమర్శించారు. చంద్రబాబుకి అనుకూలంగా షర్మిల మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ 56 నెలల్లో చేసిన అభివృద్థి కోసం సీఎం జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యాలను ఎల్లో మీడియా వక్రీకరించిదని సజ్జల మండిపడ్డారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబుతో ఎలాంటి ఒప్పందం కుదిరిందో చెప్పాలని షర్మిలను సజ్జల డిమాండ్ చేశారు.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×