Baasinga Balalu Song:”బాసింగ బలాలు” అంటూ వచ్చిన ఆల్బమ్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ పాట యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేసింది. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేసి తెగ వైరల్ చేశారు. అంతేకాదు పెళ్లి వేడుకలను మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్ల వరకు ఎక్కడ చూసినా ఈ పాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటకి రూ.11 లక్షలు ఖర్చుపెడితే.. మొత్తం ఎంత వచ్చిందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్క యూట్యూబ్ ద్వారానే ఈ పాట సంపాదించిన డబ్బు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రముఖ ఫోక్ డాన్సర్స్ గా పేరు సొంతం చేసుకున్న ఈశ్వర్ సాయి (Eshwar Sai), మాధురి రాథోడ్ (Madhuri Rathod) జంటగా ఎన్నో పాటలకు పెర్ఫార్మన్స్ ఇచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ పాటతో ఊహించని పాపులారిటీ లభించిన విషయం తెలిసిందే. ఇందులో తమ అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ హృదయాలను కూడా దోచుకున్నారు. అలా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బాసింగ బలాలు పాటకి యూట్యూబ్ ద్వారా సుమారుగా రూ.40 లక్షలకు పైగానే ఆదాయం వచ్చినట్లు ఈ పాట ప్రొడ్యూసర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని స్పష్టం చేశారు. మొత్తానికైతే 11 లక్షలతో వచ్చిన పాట ఏకంగా ఈ రేంజ్ లో ఆదాయం పొందడం ప్రశంసనీయమని చెప్పవచ్చు.
మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఈ పాటతో ఎంత అయితే పాపులారిటీ సంపాదించుకున్నారో.. ఈ పాట తర్వాత అంతే చిక్కులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వీరిద్దరూ ఏకాంతంగా ఒకే గదిలో ఈశ్వర్ సాయి భార్యకు పట్టుబడడం, ఆమె అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. పైగా అటు మాధురి ఇటు ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఇద్దరూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇక ఈశ్వర్ సాయి తనను మోసం చేశాడని ,పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకున్నాడు అంటూ ఆత్మహత్యాయత్నం చేసింది మాధురి రాథోడ్.
also read:ఈ వారం కూడా వర్షిణి సేఫ్.. డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?
ఇకపోతే ఆ బాధ నుండి బయటపడ్డ మాధురి మళ్ళీ ఎప్పట్లాగే తన అదిరిపోయే ఫోక్ పెర్ఫార్మెన్స్ తో వరుస పాటలు విడుదల చేస్తూ జోరు మీద దూసుకుపోతోంది. అటు ఈశ్వర్ సాయి కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయారు. ఏది ఏమైనా ఈ ఒక్క పాట వీరి కెరీర్ కి ఊహించని ఆదరణ అందించినప్పటికీ జీవితంలో మోయలేని మచ్చను ఎదుర్కొన్నారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.