Murli Karthik Slams Mohmmad Amir: టీమిండియా టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మను స్లాగర్ అంటూ కామెంట్ చేసిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ పై మురళీ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కళ్ళు మూసుకుని ఆడతాడని విమర్శలు చేసిన ఆ వెధవను చెప్పుతో కొట్టాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు వాడు దొరికితే రెండు చెంపలు వాయిస్తానని హెచ్చరించాడు. భారత ఫ్లాట్ పిచ్ ల పైనే కాదు, న్యూజిలాండ్ మైదానంలో కూడా అభిషేక్ శర్మ ఇరగదీసాడని… అలాంటోడిని స్లాగర్ అని ఎలా అంటాడని నిప్పులు చెరిగాడు. ఇలాంటి పాకిస్తాన్ వెధవలకు క్రికెట్ వ్యాల్యూ తెలియదని.. అందుకే నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారని ఫైర్ అయ్యారు. దీంతో మహమ్మద్ అమీర్ పై మురళీ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అభిషేక్ శర్మపై విమర్శలు చేసిన మహమ్మద్ అమీర్ పై మురళీ కార్తీక్ సీరియస్ అయ్యారు. వీడికి క్రికెట్ ఆడడమే చేతకాదు.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటూ కుట్రలకు తెర లేపే ఈ దుర్మార్గుడు అభిషేక్ శర్మ గురించి మాట్లాడతాడా ? వాడి ముఖం ఒకసారి అద్దంలో చూసుకుంటే మంచిదంటూ హితువు పలికారు. గతంలో ఫిక్సింగ్ కు పాల్పడి లండన్ జైలులో ఐదు సంవత్సరాలు చిప్పకూడు తిన్న సిగ్గు రాలేదని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ దేశంలో తినడానికి తిండి లేక లండన్ పారిపోయిన దద్దమ్మ అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాస్కెల్ అభిషేక్ శర్మ లాంటి టీ20 నెంబర్ వన్ ఆటగాడి గురించి విమర్శలు చేస్తాడా ? అసలు వాడికి ఏ అర్హత ఉందని స్లాగర్ అంటాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
అభిషేక్ శర్మ తాజాగా 35 బంతుల్లో సెంచరీ చేసిన క్రమంలో అతడికి మహమ్మద్ అమీర్ క్షమాపణలు చెప్పాడు. గతంలో స్లాగర్ అన్నందుకు అభిషేక్ శర్మ క్షమించాలని తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గతంలో స్లాగర్ అంటూ తాను అనవసరంగా కామెంట్స్ చేశానని…ఇప్పుడు అభిషేక్ శర్మ సత్తా ఏంటో తెలుసుకున్నట్టు వివరించాడు. భారత పిచ్ లపైనే కాకుండా న్యూజిలాండ్ గడ్డపై అదిరిపోయే సెంచరీ చేశాడని కితాబ్ ఇచ్చాడు. ఇలాంటి ఆటగాడిని తాను గతంలో విమర్శించినందుకు సిగ్గుగా ఉందని రియలైజ్ అయ్యాడు. ఇకపై అభిషేక్ శర్మను తాను పల్లెత్తి మాట అనబోనని వ్యాఖ్యానించాడు. దీంతో అభిషేక్ శర్మపై అమీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.