E-Paper
Advertisement

భీమిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా.. డాక్టర్ బొత్స అనూష సరికొత్త రికార్డు?

భీమిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా.. డాక్టర్ బొత్స అనూష సరికొత్త రికార్డు?
Advertisement

Botsa Anusha: రాజకీయాల్లో నాయకత్వ సమర్థత అనేది అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా.. సంక్షోభాలు, ఎన్నికలు ఒకేసారి ఎదురైనప్పుడు బయటపడుతుందా? గతంలో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినప్పుడు విమర్శలు చేసిన వారి ముందే.. క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతమైన పనితీరుతో సరికొత్త నాయకురాలిగా డాక్టర్ బొత్స అనూష నిరూపించుకుంటున్నారా? భీమిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా డాక్టర్ బొత్స అనూషను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సమయంలో కొందరు రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్థులు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు.

పల్లెల్లో ప్రచారం..

కానీ స్థానిక సంస్థల సమరంలో బొండపల్లి జడ్పీ టీసీ అభ్యర్థిగా పార్టీ ఆదేశించగానే ఎన్నికల బరిలోకి దూకి.. పల్లెల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు ఆర్నబ్ తుపాను రూపంలో విరుచుకుపడ్డ ప్రకృతి విపత్తు వేళ వెంటనే భీమిలికి చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తీరప్రాంత ప్రజల వద్దకు వెళ్లి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ నేనున్నా పార్టీ అండగా ఉంటుంది అంటూ బాధితులతో మాట్లాడారు. ఒకవైపు గెలుపోటములను నిర్ణయించే సొంత ఎన్నికల ప్రచారం.. మరో వైపు ప్రజా సమస్యలపై నిలబడాల్సిన సమన్వయకర్త బాధ్యత.. ఈ రెండింటినీ డాక్టర్ బొత్స అనూష ఎలా సమతూకం చేస్తున్నారు.

Advertisement

Also Read: డిజిటల్ అరెస్టుల వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఉక్కుపాదం మోపాలని ఆదేశం

ఎలా నడిపించగలరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలోని కీలక తీరప్రాంత నియోజకవర్గమైన భీమిలికి సమన్వయకర్తగా డాక్టర్ బొత్స అనూష పేరును ఖరారు చేసినప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. రాజకీయంగా ఎంతో సున్నితమైన, విశాలమైన నియోజకవర్గాన్ని ఒక యువ మహిళా నాయకురాలు ఎలా నడిపించగలరు? సీనియర్లు, బలమైన ప్రత్యర్థులు ఉన్న చోట పట్టు సాధించగలరా అన్న అనుమానాలు, విమర్శలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి.అయితే డాక్టర్ బొత్స అనూష ఆ విమర్శలను ఎక్కడా ప్రతిఘటించకుండా.. మౌనంగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో మమేకమవడం ప్రారంభించారు. విద్యావంతురాలిగా ఉన్న ఆలోచనా విధానంతో భీమిలిలోని స్థానిక అంశాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

ఎన్నికల నోటిఫికేషన్..

Advertisement

భీమిలిలో పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దుకుంటున్న సమయంలోనే స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్ఠానం అనూషను ఆదేశించింది. నియోజకవర్గాల సరిహద్దులను లెక్కచేయకుండా, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఆమె వెంటనే బొండపల్లి ఎన్నికల బరిలోకి దిగారు. ముద్దూరుతో సహా మండలంలోని గ్రామం గ్రామాన్నీ చుట్టేస్తూ.. 24/7 వాట్సాప్ గ్రీవెన్స్ వంటి వినూత్న పాలనా హామీలను ప్రజల ముందుంచుతూ ఎన్నికల ప్రచారంలో అత్యంత వేగంగా దూసుకుపోయారు. రాజకీయ అనుభవం ఉన్న నాయకుల సైతం ఆశ్చర్యపోయేలా గ్రామీణ ఓటర్లతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.

Also read: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. ఐదుగురు మృతి, పలు జిల్లాల్లో భారీ నష్టం!

Tags

Related News

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా!

ఆర్నాబ్ తుఫాను బీభత్సం.. రైతులను ఆదుకోండి.. కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ!

బొండపల్లి నియోజకవర్గంపై.. డాక్టర్ బొత్స అనూష నయా వ్యూహం!

45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. స్థానిక ఎన్నికలపై కీలక దిశానిర్దేశం!

ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. ఐదుగురు మృతి, పలు జిల్లాల్లో భారీ నష్టం!

పవన్ కళ్యాణ్‌కు మాజీ డిప్యూటీ సీఎం బిగ్ షాక్.. మహిళల దాడులపై సంచలన సవాల్!

అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ.. అర్నబ్ తుఫాను నష్టంపై కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి

Big Stories

Advertisement
×