SC on YS Jagan: వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో స్పల్ప ఊరట లభించింది. ఆయనపై ఉన్న కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు పిటిషనర్. సోమవారం వాదనల్లో అసలేం జరిగింది?
జగన్ బెయిల్ రద్దు, కేసుల విచారణ వేరే కోర్టుకి తరలించాలంటూ రెండు పిటిషన్లు వేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ రెండింటిపై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్నం ధర్మాసనం విచారణ చేపట్టింది.
బెయిల్‌పై ఉన్న జగన్, ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించినట్టు లేదని తెలిపింది న్యాయస్థానం. ఎలాంటి సంఘటనలు జరగలేదని తెలిపింది. దీంతో ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది భావించారు. అందుకు ధర్మాసనం అనుమతించింది.
జగన్ కేసులకు సంబంధించి హైకోర్టు పర్యవేక్షణ చేస్తుందని, రోజువారీ విచారణ జరపాలని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే విచారణ మరింత జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయ పడింది. దీంతో ఆయన పిటిషన్‌కు కొట్టివేసింది.
ఎంపీ, ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి విచారణలో రోజువారీ చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. జగన్ కేసుల్లో మాత్రం శుక్రవారం మాత్రమే విచారణ చేస్తున్నారని పిటిషన్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పదేళ్లు కిందట తెలంగాణ ఏర్పడిందని, కేసుల విచారణ అక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ఆరుసార్లు జడ్జీలు బదిలీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్-సీబీఐ కుమ్మక్కు అయినట్టు ఉందని, అందుకే విచారణ ముందుకు వెళ్లలేదన్నారు.