రైల్వే ప్రయాణాల్లో వింత వింత ఘటనలు జరుగుతాయి. కొందరు కదిలే రైలు ఎక్కుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలున్నాయి. మరికొంత మందిని తృటిలో ప్రయాణాపాయం నుంచి కాపాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే ప్రయాణాల్లో జరిగే పలు సంఘటనల్లో కొన్ని బాధను కలిగిస్తే, మరికొన్ని నవ్వు పుట్టిస్తాయి. అయితే, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే, నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. ముందుగా ఈ వీడియోను చూడండి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
వాస్తవానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు . కానీ, ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు కోసం చాలా మంది ప్రయాణీకులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో రైలు రానే వచ్చింది. ఇలా ప్లాట్ ఫారమ్ మీద ఆగగానే ఒక్కసారిగా జనాలు ఎక్కేందుకు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు, జనాలను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అతడు ఎక్కుతుంటే, అతడితో పాటు ఎక్కేందుకు వెనుకున్న మరో వ్యక్తి అతడి షర్ట్ గట్టిగా పట్టుకుని ఎక్కే ప్రయత్నం చేశాడు. అలా పట్టుకోగానే షర్ట్ వెనుక వైపు పూర్తిగా చినిగిపోయింది. వెంటనే అతడు వెనక్కి తిరిగి చూసుకుని షాక్ అవుతాడు. ఎలా వెళ్లాలో తెలియక బాధపడతాడు. అతడిని చూసి మిగతా ప్రయాణీకులు కూడా అయ్యో పాపం అన్నట్లుగా చూశారు. అక్కడితే వీడియో అయిపోతుంది. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఏమంటున్నారు అంటే?
ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది అయ్యో పాపం అంటుంటే, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ షర్ట్ చింపిన వాడిని అరెస్ట్ చేయాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇదంతా వ్యూస్ కోసం చేశారు.. జస్ట్ స్క్రిప్ట్ అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అరే.. ఇప్పుడు చినిగిన షర్ట్ తో జర్నీ ఎలా చేస్తాడు? అంటూ ఇంకొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నెటిజన్ల కామెంట్స్ తో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.
ఇక రీసెంట్ గా కిటికీలో నుంచి దొంగతనం చేయబోయి ప్రయాణీకులకు దొరికిపోయిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రైలు కదులుతున్న సమయంలో కిటికీలో నుంచి లోపలికి చేతులు పెట్టగానే ప్రయాణీకులు అతడిని పట్టుకున్నారు. అప్పటికే రైలు వేగం పెరగడంతో అలాగే వేలాడుతూ నరకయాతన అనుభవించాడు. కొంతదూరం వెళ్లాక ప్రయాణీకులు ఎమర్జెన్సీ చైన్ లాగి దొంగను రైల్వే పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
Read Also: దొంగకు దూల తీరింది.. కిటికీలో చెయ్యి పెట్టాడు, ఇంతలో రైలు కదిలింది, ఆ తర్వాత…!