BigTV English

Gudivada Politics: నయా స్కెచ్‌తో కొడాలి నాని రీ ఎంట్రీ

Gudivada Politics: నయా స్కెచ్‌తో కొడాలి నాని రీ ఎంట్రీ

Gudivada Politics: వైసీపీ ఓటమి తరువాత గుడివాడ నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయట. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలై నియోజకవర్గానికి సంవత్సరానికి పైగా దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని .. గుడివాడలో తన పొలిటికల్ ఎంట్రీకి సమయం కోసం ఎదురు చూస్తున్నారట. ఓటమి తరువాత కొత్త లెక్కలతో మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారట. అసలంతకీ కొడాలి నాని రీఎంట్రీకి వేసుకుంటున్న లెక్కలేంటి? మళ్లీ గుడివాడలో ఎలా పావులు కదపాలని చూస్తున్నారు?


గుడివాడలో పదేళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా

గుడివాడకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణాజిల్లా గుడివాడ అంటే ఎప్పుడూ పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పుడూ హాట్‌ హాట్‌గా నానుతూనే ఉంటుంది. గత ఎన్నికల్లో గుడివాడలో పదేళ్ల తర్వాత తిరిగి టీడీపీ జెండా ఎగరడంతో ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆ చర్చ మరింత పెరిగింది. గుడివాడలో ఓటమి ఎరుగని నేతగా పేరున్న కొడాలి నాని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడను కొడాలి నాని తన కంచుకోటగా మార్చుకున్నారు. టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచిన కొడాలి నాని తర్వాత వైసీపీలో చేరి మరో రెండు సార్లు వరుస విజయాలు సాధించారు. అలా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా గుడివాడలో చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఏరికోరి గుడివాడ నుంచి వెనిగండ్ల రామును బరిలో నిలిపింది. ఎన్నో అంచనాల నడుమ బంపర్ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధించి కొడాలి నానికి చెక్ పెట్టారు. దాంతో గుడివాడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కొడాలి నాని ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరం అయ్యారు.


అనారోగ్యంతో నియోజకవర్గానికి పూర్తిగా దూరమైన నాని

కొడాలి నాని పరాజయం పాలయ్యాక.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి వరుసగా కేసులు నమోదవ్వడంతో.. గడ్డం బ్యాచ్‌గా పిలుచుకునే ఆయన అనుచరవర్గమంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఇక నానిపై సైతం కేసులు నమోదు కావడంతో పాటు అనారోగ్యంతో నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. దాంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. వైసీపీ క్యాడర్ పెద్ద దిక్కు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అరోగ్యం కుదుటపడిన కొడాలి నాని బయటకు రావడంతో పాటు, కేసుల్లో బెయిల్ సైతం మంజూరు కావడంతో అడపా దడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. కండిషన్తో కూడిన బెయిల్ మంజూరు కావడంతో గుడివాడ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. కోర్టుకుహాజరవ్వడానికి అడపాదడపా అడపా దడపా గుడివాడ వస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పర్యటనలు చేయకపోయినా నేతలను కలుస్తూ పార్టీ పరిస్థితినీ అడిగి తెలుసుకుంటున్నారంట.

పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా వెళ్లిపోయిన నాని

ప్రస్తుతం గుడివాడలో కొడాలి నాని యాక్టివ్‌గా లేకపోయినా నియోజవర్గంలో రాజకీయాలను మాత్రం ఫాలో అవుతున్నారంట. పార్టీ కార్యక్రమాలలో సైతం పాల్గొనటం లేదు. ఇటీవల వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ..బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ … ఆందోళనలు గుడివాడలో జరుగుతున్నప్పుడు… అదే రోజున గుడివాడలో ఉన్న కొడాలి కార్యక్రమంలో పాల్గొనకుండానే స్టేషన్, కోర్టుకు హాజరై సంతకాలు చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. నియోజకవర్గంలో ఉండి కూడా కనీసం పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా వెళ్లడంతో పార్టీ నేతలు ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు నియోజవర్గంలో వరుసగా నేతలపై దాడులు, అరెస్టులు, కేసులు కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా, తన సందేశాన్ని ఇవ్వకుండా కొడాలి నాని సైలెంట్ అవడంతో అస్సలు ఎందుకు నాని మౌనంగా ఉంటున్నారన్నది వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదంట. భయపడ్డారా లేదా మరేదైనా వ్యూహంలో భాగంగా అడుగులు వేస్తున్నారా ? అన్న చర్చ మొదలైంది.

తెరవెనుక నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా?

అయితే ఘోరపరాజయం తర్వాత నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా.. కొడాలి నాని తెరవెనుక నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట . అందులో భాగంగానే మాజీ మంత్రి కటారి ఈశ్వర్‌ను గుడివాడలో సైలెంట్‌గా రంగంలోకి దింపారన్న చర్చ ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో క్యాబినెట్ మంత్రిగా పని చేసిన కటారి ఈశ్వర్ అన్ని పార్టీలు మారి చివరికి తటస్థంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా గుడివాడలో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

టీడీపీపై నిప్పులు చెరిగిన బీసీ నేత కటారి ఈశ్వర్

ఇటీవల గుడివాడలో బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ ఆందోళన సందర్భంగా అల్లర్లు చోటు చేసుకోవడం లాంటి పరిణామాలతో .. బిసి రాగాన్ని అందుకున్న ఈశ్వర్ టీడీపీపై నిప్పులు చెరిగారు. కొడాలి నానికి మద్దతు ప్రకటించారు. దాంతో గుడివాడలో తన పట్టుకుని, సామాజిక సమీకరణాల ఆధారంగా టీడీపీ దెబ్బ కొట్టేందుకు కటారి ఈశ్వర్‌ను కొడాలి నానినే యాక్టివ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గుడివాడ నియోజకవర్గం పరిధిలో అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలను ఐక్యం చేసేలా కటారి ఈశ్వర్ ద్వారా తెర వెనుక వ్యూహాత్మకంగా కొడాలి నాని పావులు కదుపుతున్నారని టీడీపీ భావిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లుగా బిసి కులాల్లో ఉన్న యాదవ, గౌడ, కళింగ, రజక, కొప్పుల వెలమ, సామాజిక వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈశ్వర్‌ను అనూహ్యంగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. టీడీపీలో చీలికలు తెచ్చేందుకు నాని తెర వెనుక ఉండి ఈశ్వర్ ద్వారా దెబ్బ కొట్టాలని చూస్తున్నరని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Also Read: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

కటారి ఎంట్రీ వెనుక కొడాలి నాని స్కెచ్

ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని మరో మూడు నెలల్లో గుడివాడలో పూర్తిస్థాయిలో రీఎంట్రీ ఇస్తారని స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. దానికి తగ్గట్లే గుడివాడ వైసీపీ శ్రేణులను యాక్టివ్ చేయానికి కటారి ఈశ్వర్ రంగంలోకి దిగడం వెనుక కొడాలి నాని స్కెచ్ ఉందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

AP real estate: ఏపీలో రియల్ ఎస్టేట్ హవా.. 3 నెలల్లోనే మరీ ఇంత ఆదాయమా!

Big Stories

×