BigTV English
Advertisement

Senior NTR : ఎన్టీఆర్ గురించి అరుదైన 10 విశేషాలు..

Senior NTR : ఎన్టీఆర్ గురించి అరుదైన 10 విశేషాలు..

Senior NTR : 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా ఆయన అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి ఎన్టీఆర్ నాయకత్వం వహించారు. 1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకున్నారు. ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు.


దేవాలయాలలో పూజారులుగా బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌ది. న్యూయార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయిన.. ఎన్టీఆర్ హైదరాబాదులో హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహ ఏర్పాటు మొదలుపెట్టారు. ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలోని ఒక సీన్‌ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే.. కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు.
1987 హర్యానా ఎన్నికల్లో దేవీలాల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో వెళ్లారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.

తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తన ఇంటికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లి చెంబుతో కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లిచ్చి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు వచ్చిన అతిథులకు ఎన్టీఆర్ స్వయంగా వడ్డించేవారు. ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు. ‘ఇదేంటి’ అని అడిగినవారికి ‘హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను’ అన్నారట.


Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×