Turakapalem: తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. అక్కడ నుంచి సేకరించిన మట్టి నమునానాల్లో యురేనియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తించారు. యురేనియం నిల్వలు ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు పరీక్షల్లో తేలినట్లు సమాచారం. తురకపాలెంలో ICAR నేతృత్వంలోని ప్రైవేట్ సంస్థ మట్టి పరీక్షలు చేసింది. ఎక్కువమంది బాధితులు క్వారీ తవ్వకాల్లో పనులకు వెళ్ళి అక్కడ నీటిని ఉపయోగించడంతోనే యురేనియం అవశేషాలు శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ కారణంతోనే వారు అనారోగ్య సమస్యలకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.
పూర్తి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు రూరల్ మండలంలో ఉన్న తురకపాలెం గ్రామంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణాలతో అల్లకల్లోలంగా మారింది. ఈ గ్రామంలో గత రెండు నెలల్లో 23 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నారు. మొత్తం గత ఐదు నెలల్లో 29 మంది మరణాలు సంభవించాయి. ఈ మరణాలకు కారణం మెలియాయిడోసిస్ (Melioidosis) అనే బాక్టీరియా సంక్రమణ అని అధికారులు చెబుతున్నారు.
మెలియాయిడోసిస్ అనేది బుర్క్‌హోల్డేరియా సూడోమల్లీ (Burkholderia pseudomallei) అనే బాక్టీరియా వల్ల సంభవించే సంక్రమణ, ఇది మట్టి, నిలిచిన నీటిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది ఆరోగ్యవంతులకు సాధారణంగా ప్రమాదకరం కాకపోయినా, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ప్రాణాంతకం కావచ్చు. గ్రామంలో ఒకరు మెలియాయిడోసిస్‌తో బాధపడుతున్నట్లు ల్యాబ్ టెస్టుల్లో నిర్ధారణ అయింది. అలాగే మరో ఇద్దరు కూడా ధృవీకరించబడ్డారు.
తురకపాలెంలో మట్టి పరీక్షలు నిర్వహించిన ICAR
రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ముఖ్య మంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు గ్రామవాసులందరి ఆరోగ్య ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారు. డోర్-టు-డోర్ సర్వేలు నిర్వహించి, అనారోగ్య సమస్యలున్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) బృందం గ్రామంలోకి వచ్చి నీరు, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు.
అక్కడ నీటిని ఉపయోగించడంతోనే యురేనియం అవశేషాలు
అయితే, ఇటీవలి కొన్ని నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు యురేనియం నిక్షేపాలు ఈ సమస్యలకు కారణమని చెబుతున్నారు. ది ఫెడరల్ న్యూస్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, చెన్నై ల్యాబ్‌లలో చేసిన నీటి పరీక్షల్లో తురకపాలెం చుట్టుపక్కల క్వారీ పిట్స్‌లో యురేనియం అవశేషాలు గుర్తించబడ్డాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు కారణమని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. గత 8 నెలల్లో 45 మంది మరణించారని, యురేనియం కిడ్నీలు, చర్మం, లివర్, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. నీటిలో స్ట్రోంటియం, ఇ.కోలి బాక్టీరియా కూడా ఉన్నట్లు పరీక్షలు తెలిపాయి. క్వారీ తవ్వకాల్లో పని చేసే గ్రామస్థులు అక్కడి నీటిని ఉపయోగించడం వల్ల యురేనియం అవశేషాలు శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు..
తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు
చెన్నై ప్రయోగశాలలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం
తురకపాలెంలో మట్టి పరీక్షలు నిర్వహించిన ICAR నేతృత్వంలోని ప్రైవేట్ సంస్థ
యురేనియం అవశేషాల వల్లే అనారోగ్య సమస్యలు అని ప్రాథమిక నిర్ధారణ
తురకపాలెం పరిసరాల్లోని క్వారీ గుంతల… pic.twitter.com/WIBlj7M252
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025