Hyderabad News: హైదరాబాద్ సిటీలో ఓ ప్రైవేటు పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పే స్కూల్‌లో ఇలాంటివి బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. చట్ట విరుద్ధంగా అల్ప్రాజోలం మత్తు మందును తయారు చేస్తుండటం నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో తీగలాడితే డొంకంతా కదులుతోంది. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది.
పాత బోయిన్‌పల్లి ప్రాంతంలో నారాయణ యాదవ్‌కు చెందిన భవనంలో మేధా పేరిట పాఠశాలలను నిర్వహిస్తున్నాడు జయప్రకాశ్ గౌడ్. ఐదుగురితో కలిసి పాఠశాల వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాల రెండో అంతస్తులో ఒక వైపు తరగతి గదులు జరుగుతున్నాయి. మరో వైపు పాఠశాల వెనుక వైపు మత్తు కలిగించే అల్ఫాజోలం మాత్రలు తయారీ చేస్తున్నారు.
శనివారం ఈగిల్ టీమ్ సోదాల్లో అల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ బయటపడింది. మేథా స్కూల్ యజమాని జయప్రకాశ్ గౌడ్‌తోపాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల వెనుక భాగంలో గుట్టుగా 8 తయారీ యూనిట్ నడుపుతున్నట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఓ ప్రాంతానికి అల్ప్రాజొలామ్ సరఫరా చేస్తున్నాడట నిందితుడు.
నులి పురుగుల మాత్రలకు రసాయనాలు కలిపి తయారు చేసినట్టు సమాచారం. నగరంలో వివిధ ప్రాంతాల్లో కల్లు కౌంపౌండ్లకు వాటిని సరఫరా చేస్తున్నట్లు అనధికార సమాచారం. మేధా పాఠశాల నిర్వాహకుడు జయప్రకాశ్ గౌడ్ రూములో అల్ఫాజోలం మాత్రలు లభించడంతో ఒక్కసారిగా అధికారులు షాకయ్యారు. అధికారులు 3.5 కిలోల అల్ప్రాజొలాం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ స్వాధీనం చేశారు.
ALSO READ: కొడుకుని చంపిన తండ్రి.. మూటకట్టి మూసీలో పడేశాడు
అంతేకాదు రూ.21 లక్షల నగదు, ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది కిందట జయప్రకాష్ గౌడ్‌కు శేఖర్ అనే వ్యక్తి ద్వారా గురువారెడ్డి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో గురవారెడ్డి సలహా ఇచ్చాడు. దాని వల్ల ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని, ఎవరికి అనుమానం రాదని చెప్పాడు. పరిస్థితి గమనించిన జయప్రకాష్‌గౌడ్ సరేనని ఊ కొట్టాడు.
స్కూల్ వెనుక భాగంలో గురువారెడ్డి ఇచ్చిన సూచనలతో యూనిట్‌తోపాటు అల్ప్రాజొలామ్‌ను తయారు చేయడం మొదలుపెట్టాడు. అల్ప్రాజొలాం తయారీ వెనుక ఎవరున్నారు? ఇప్పటివరకు తయారు చేసిన మత్తు మాత్రలను ఎవరెవరికి విక్రయించారు? దీనివెనుక పెద్ద తలకాయలు ఎవరున్నారు? ఎవరూ లేకుండా నేరుగా పాఠశాలలో తయారీ యూనిట్‌ని ఎలా పెట్టారు? అనేదానిపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.
అల్ప్రాజోలం వ్యవహారం ఇప్పటిది కాదు. నాలుగేళ్ల కిందట కల్లు తాగి చాలామంది అస్వస్థతకు గురయ్యారు. మహాబూబ్‌నగర్ జిల్లాలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కల్లులో అల్ప్రాజొలామ్ ఉపయోగించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారగానే ఆ వ్యవహారం మరుగునపడింది.
తాజాగా స్కూల్‌లో అల్ప్రాజొలామ్ తయారీ వ్యవహారం వెలుగులోకి రాగానే పాత విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. అంతేకాదు కల్లు కాంపౌండ్‌కు అల్ప్రాజొలాం సరఫరా చేస్తున్నట్లు తెలియడంతో ఏయే జిల్లాలకు సరఫరా చేశారు? అనేదానిపై విచారణ మొదలుపెట్టారు అధికారులు.
డ్రగ్స్ తయారీకి డెన్ గా మారిన చిన్న పిల్లల స్కూల్..
అల్ఫాజోలం తయారీ కేంద్రంగా బోయిన్ పల్లి మేధా స్కూల్
క్లాస్ రూమ్ లను డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చేసిన స్కూల్ డైరెక్టర్ జయ ప్రకాష్ గౌడ్, మరో ఇద్దరు
10 గంటలుగా కొనసాగుతున్న ఈగల్ టీమ్ సోదాలు
8 రియాక్టర్స్, 8 డ్రయ్యర్స్ సీజ్… https://t.co/49NNIrmGBm pic.twitter.com/y3ssQJwX4G
— BIG TV Breaking News (@bigtvtelugu) September 13, 2025