BigTV English

Mithun Reddy: ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. నెక్ట్స్ అరెస్టేనా?

Mithun Reddy: ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. నెక్ట్స్ అరెస్టేనా?

Mithun Reddy: ఆంధ్రా రాజకీయాల్లో త్వరలోనే మరో సంచలనం నమోదయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే.. ఏపీ పాలిటిక్స్‌లో లిక్కర్ స్కామ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఇప్పుడిదే లిక్కర్ స్కామ్ కేసులో.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు.


మిథున్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయని సిట్
ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన విషయంలో సిట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డిపై.. సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయలేదు. వచ్చే వారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు.. అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీ హయాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర
ఏపీలో మద్యం ఆర్డర్లు, సప్లై చైన్‌లో.. ఆన్‌లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని.. వైసీపీ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. దాంతో.. లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. మడుపులు అందిన కంపెనీలకే.. మద్యం సప్లై చేసేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు.


మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్
లిక్కర్ స్కామ్ ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాకు 3500 కోట్ల నష్టం జరిగినట్లు చెబుతున్నారు. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి పాత్రే కీలకమనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి వ్యూహరచన, అమలులో.. మిథున్ రెడ్డే మాస్టర్ మైండ్ అంటూ.. సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు కూడా దొరికినట్లు సమాచారం. ఎంపీ పదవిని దుర్వినియోగం చేయడమే కాదు.. లిక్కర్ స్కామ్‌లో విచారణకు కూడా మిథున్ రెడ్డి సహకరించడం లేదని హైకోర్టులో వాదించారు లాయర్. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని, ఆయనపై 8 కేసులు నమోదయ్యాయని.. అందువల్ల ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు.

Also Read: వర్ష ప్రియులు సందర్శించడానికి హైదరాబాద్‌లో బెస్ట్ ప్లేసెస్ ఇవే!

మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీతో.. ఆయనకు సంబంధం లేదని వాదించారు. షరతులతో కూడిన ముందస్తు బెయిలివ్వాలని కోరారు. అయితే.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో.. లిక్కర్ స్కామ్‌లో నెక్ట్స్ అరెస్ట్ కాబోయేది.. మిథున్ రెడ్డేనన్న చర్చ జరుగుతోంది. ఇది.. ఏపీ రాజకీయ వర్గాలను ఊపేస్తోంది.

Related News

TTD Warning: టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై కేసుల నమోదు.. కటకటాలే!

Visakhapatnam: వైజాగ్‌కు టీసీఎస్ వచ్చేసింది.. 2000 మందితో త్వరలోనే..?

Pawan Kalyan Gifts: టీచర్స్ డే.. అదిరిపోయే కానుక ఇచ్చిన పవన్.. అదేమిటంటే?

Deepam-2 Scheme: ఏపీ గిరిజనులకు బంపర్ గిఫ్ట్.. చిన్న సిలిండర్‌కు గుడ్‌బై.. పెద్ద సిలిండర్‌తో ఫుల్ లాభం!

Disney World AP: అమెరికా నుంచి డైరెక్ట్ షిఫ్ట్.. డిస్నీ వరల్డ్ కోసం రెడీ అవుతున్న.. ఏపీలోని ఆ నగరం!

Vizag Updates: విశాఖకు స్పెషల్ గెస్ట్ వచ్చేశారు.. అలా వెళ్లి ఇలా చూసి రండి!

Big Stories

×