E-Paper
Advertisement

‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక

‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక
Advertisement

Raja Singh: ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చట్టాలు, చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కుట్ర కోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.

రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతో షేక్ సాదిక్ అనే వ్యక్తి యువతులను ట్రాప్ చేస్తున్నాడని, అతడి బారిన ఇంకా ఎంతమంది పడ్డారనే విషయంపై సమగ్ర విచారణ జరపాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంస్థలు, ట్రైనింగ్ సెంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Advertisement

హిందువులు తమ పిల్లలను కాలేజీలు, హాస్టళ్లు లేదా ట్రైనింగ్ సెంటర్లకు పంపించే ముందు ఆయా సంస్థల నిర్వహణ, కార్యకలాపాలు, అక్కడి పరిస్థితులపై పూర్తిగా పరిశీలించుకోవాలని రాజాసింగ్ సూచించారు. యువతులను మోసం చేయడం, వేధించడం లేదా ఇతర మార్గాల్లో ట్రాప్ చేయడం వంటి ఆరోపణలు ఉంటే వాటిపై కఠినంగా దర్యాప్తు చేయాలని అన్నారు.

Also Read: ‘ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!

Advertisement

నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి, నిందితుడిపై నేరం రుజువైతే చట్టప్రకారం కఠిన శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: జాయ్ రైడ్‌లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!

Tags

Related News

గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ కలకలం.. పోలీసుల రికార్డుల్లో షాకింగ్ నిజాలు!

సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?

ఎన్నికలంటే వైసీపీకి వణుకు.. అందుకే న్యాయస్థానాలకు, పార్టీ పరంగా బీసీలకు న్యాయం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×