E-Paper
Advertisement

గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!

గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!
Advertisement

Google Pixel 10 Price Cut: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఇటీవలె పిక్సెల్ 11 సిరీస్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మునుపటి మోడల్ పిక్సెల్ 10 ధరను భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఇది నిజంగా మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో ఈ ఫోన్ ఇప్పుడు ఊహించని విధంగా తక్కువ ధరకే లభిస్తోంది.

ధర తగ్గింది.. ఆఫర్లు పెరిగాయి:

భారత్‌లో రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10.. ఇప్పుడు ఆఫర్‌లో రూ.65,880కే అందుబాటులోకి వచ్చింది. అంటే వినియోగదారులకు నేరుగా రూ.14,119 వరకు లబ్ధి చేకూరుతోంది. దీనికి తోడు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించేవారికి అదనంగా రూ.3,294 వరకు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.33,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది.

Advertisement

Also Read: ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!

డిస్‌ప్లే, అద్భుతమైన ప్రాసెసర్:

ఈ ఫోన్ 6.3 అంగుళాల కాంపాక్ట్ సైజ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కారణంగా ఫోన్ స్క్రీన్ చాలా సున్నితంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని అందించారు. గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సర్ G5 చిప్‌సెట్‌తో పాటు 12GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. రోజువారీ వాడకంలోనే కాకుండా గేమింగ్, ఇతర టాస్క్‌లలో ఈ ఫోన్ మెరుగైన ప్రదర్శన ఇస్తుంది.

కెమెరా ఐ మేజిక్, సుదీర్ఘ అప్‌డేట్లు:

Advertisement

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం దీనిలో 48MP ప్రైమరీ, 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్, బెస్ట్ టేక్, నైట్ సైట్ వంటి ఏఐ (AI) ఫీచర్లు ఫొటోలను మరింత అందంగా మారుస్తాయి. దీనితో పాటు గూగుల్ ఈ ఫోన్‌కు ఏకంగా ఏడేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తామని హామీ ఇచ్చింది.

Also Read: బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

Tags

Related News

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!

చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్‌!

అన్-నోన్ యాప్స్‌కు ఈ పర్మిషన్లు ఇస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం!

టీవీలకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? చాలా మందికి తెలియని షాకింగ్ నిజం ఇదే!

కళ్లు చెదిరే ఫీచర్లతో..హైయర్ నుంచి ఎల్ఈడీ టీవీలు లాంచ్!

Big Stories

Advertisement
×