BigTV English

DSPs transferred: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ.. ఎంతమంది ట్రాన్స్‌ఫర్ అయ్యారో తెలిస్తే షాకవుతారు!

DSPs transferred: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ.. ఎంతమంది ట్రాన్స్‌ఫర్ అయ్యారో తెలిస్తే షాకవుతారు!

DSPs transferred in AP(Latest news in Andhra Pradesh): ఏపీలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.


మొత్తంగా 96 మందిని డీఎస్పీలను బదిలీ చేయగా.. వీరిలో పలువురు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిగతా 57 మందిని మాత్రం హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలంటూ వారికి సూచించింది. బదిలీ అయిన డీఎస్పీ ఎధికారుల్లో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తోపాటు ఇతర పలు విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.

Also Read: మాటలొద్దు జగన్.. దమ్ముంటే అసెంబ్లీకి రా : మంత్రి పార్థసారథి


ఇదిలా ఉంటే.. మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై ఆయన సమీక్షించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014 – 2019 మధ్య 24 శాతం వృద్ధి సాధించగా, 2019-24 మధ్య ఏడు శాతం మాత్రమే ఉందంటూ అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టంపై ఈ సమీక్షలో చర్చించారు. అయితే, ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు రూ. 1,025 కోట్ల వరకు చెల్లించలేదంటూ అధికారుల తేల్చినట్టు తెలుస్తోంది.

Related News

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

Big Stories

×