BigTV English

Bharateeyudu 2: మరో వివాదంలో భారతీయుడు.. ఓటీటీకి రావడం కష్టమే..?

Bharateeyudu 2: మరో వివాదంలో భారతీయుడు.. ఓటీటీకి రావడం కష్టమే..?

Bharateeyudu 2: అసలు ఏ ముహూర్తాన శంకర్- కమల్ హాసన్ కలిసి భారతీయుడు 2 మొదలుపెట్టారో కానీ, అప్పటినుంచి ఈ సినిమా వివాదాల మధ్యనే నడుస్తూ వస్తుంది. మొదట్లో శంకర్ కు- లైకాకు మధ్య గొడవ.. కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. అంతా సెట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేస్తే సెట్ లో ప్రమాదం.. ఇంకొన్ని రోజులు ఆగింది. ఆ తరువాత శంకర్ .. గేమ్ ఛేంజర్ అనౌన్స్ చేసి.. మరికొంత లేట్ చేశాడు.


ఇక ఎట్టకేలకు షూటింగ్ ఫినిష్ అయ్యింది అనుకుంటే.. రిలీజ్ డేట్ వాయిదా. అలా అన్ని అడ్డంకులను దాటుకొని జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది భారతీయుడు 2. పోనీ ఇన్ని దాటుకున్నా.. హిట్ టాక్ వస్తే కొద్దిగా అయినా రిలాక్స్ గా ఉండేది. కానీ, మొదటి నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని కలక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.

లెంత్ ఎక్కువ అయ్యిందని.. ట్రిమ్ చేసినా కూడా ప్రేక్షకులు సినిమాను ఆదరించలేదు. ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశనే మిగిలింది. సరే థియేటర్ లో కాకపోతే ఓటీటీలో అయినా మంచి హిట్ టాక్ వస్తుందేమో అని ఎంతోమని భారతీయుడు 2 ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎదురుచూపులు అలాగే ఉండబోతున్నాయని తెలుస్తోంది.


ఇండియన్ 2 డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్.. రేపో మాపో ఇండియన్ 2 ను స్ట్రీమింగ్ కు రెడీ చేస్తుందేమో అనుకుంటే.. లైకాతో మళ్లీ చర్చలకు దిగిందని టాక్ నడుస్తోంది. మొదట ఇండియన్ 2 ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.

అయితే ఇప్పుడు మాత్రం సినిమా ప్లాప్ అయ్యింది అని.. అందులో సగమే ఇస్తామని నెట్ ఫ్లిక్స్ మేకర్స్.. లైకాతో చర్చలు సాగిస్తున్నారట. ఇక ఇద్దరి మధ్య తారాస్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే భారతీయుడు 2 ఓటీటీ బాట పట్టేది లేదని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Big Stories

×