BigTV English

Gachibowli Hotel Owner Murder: పట్టపగలు.. అందరూ చూస్తుండగా, రాడ్‌తో దాడి చేసి..

Gachibowli Hotel Owner Murder: పట్టపగలు.. అందరూ చూస్తుండగా, రాడ్‌తో దాడి చేసి..

Gachibowli Hotel Owner Murder: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయం.. అంతా చూస్తుండగా హోటల్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. డోర్ ఓపెన్ చేయగానే తాను తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో కుర్చీలో కూర్చొన్న శ్రీనివాస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టాడు. తలకు బలమైన గాయంకావడంతో దాదాపు నాలుగైదు గంటలపాటు మృత్యువుతో పోరాడి మరణించాడు 54 ఏళ్ల శ్రీనివాస్. సంచలనం రేపిన ఈ ఘటన గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో చోటు చేసుకుంది. హత్య వెనుక ఏం జరిగిందనే లోతుల్లోకి వెళ్తే..


యూసుఫ్‌‌‌గూడకు చెందిన శ్రీనివాస్ కొండాపూర్‌లో ఉంటున్నాడు. అంజయ్యనగర్‌లో తన కొడుకుతో కలిసి సీఎస్ డెలాయిట్ ఇన్ పేరిట హోటల్ నిర్వహిస్తున్నాడు. హొటల్ వెనుక స్టోర్ రూమ్ వద్ద పార్కింగ్ విషయమై పక్కనే ఉన్న మహేందర్‌ అనే వ్యక్తితో గొడవపడ్డాడు శ్రీనివాస్. ఈ ఘటన జరిగి చాన్నాళ్లు అయ్యింది.

జనం మధ్యలో తన పరువు తీశాడని భావించి మహేందర్, ఆయనపై కక్ష కట్టాడు. శ్రీనివాస్‌ను ఎలాగైనా  చంపాలని పగతో రగిలిపోయాడు.. అందుకు ప్లాన్ ప్రకారం స్కెచ్ వేశాడు. సరిగ్గా గురువారం సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాల సమయంలో హొటల్‌లోకి ప్రవేశించిన మహేందర్.. సోఫాలో కూర్చొన్న శ్రీనివాస్‌పై రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు.


Also Read: వడదెబ్బతో ఆరుగురు మృతి..! నేడు కూడా రాష్ట్రంలో..

అక్కడేఉన్న శ్రీనివాస్ కొడుకు కేశవ్, హోటల్ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకున్నారు. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చివరకు రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు కేశవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు మహేందర్ ఎంబీఏ చదివాడు. ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం చేసుకోవాలని పేరెంట్స్ పలుమార్లు చెప్పారు కూడా. చివరకు కోపం, పగ కారణంగా మహేందర్‌ నిందితుడైపోయాడు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×